ఏకవీర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q5350359
పంక్తి 19:
}}
తొలి తెలుగు [[జ్ఞానపీఠ అవార్డు|జ్ఞానపీఠ]] బహుమతి గ్రహీత, కవిసమ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] రాసిన ఏకవీర నవల ఈ సినిమాకు ఆధారం. ఈ సినిమాకు మాటలు రాసింది మరో జ్ఞానపీఠ గ్రహీత [[సి.నారాయణరెడ్డి]]. నారాయణరెడ్డి తన సినీరచనా జీవితంలో సంభాషణలు రాసిన సినిమాలలో ఇది మొదటిది కాగా, రెండవది [[అక్బర్ సలీం అనార్కలి]]. విశ్వనాథ సత్యనారాయణకు చిత్ర రూపం సంతృప్తి కలిగించలేదు. తొలిసారి విడుదలైనప్పుడు వ్యాపారపరంగా చిత్రం విజయవంతం కాలేదు కానీ, తరువాత విడుదలల్లో తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించారు. కె.వి.మహదేవన్ సంగీతం, దేవులపల్లి, నారాయణ రెడ్డిల సాహిత్యం చిత్రాన్ని అజరామరం చేసాయి.
== శీర్షిక ==
సినిమాకు మూలమైన విశ్వనాథ సత్యనారాయణ నవల [[ఏకవీర]] అన్న పేరే నిర్ధారించారు.
== చిత్రకథ==
[[తమిళనాడు]]లోని మదురై నేపధ్యంగా కథ సాగుతుంది. వైగై నది కూడా కథలో ఒక పాత్రగా ఉంటుంది. కుట్టాన్ సేతుపతి (ఎన్.టి.ఆర్), వీరభూపతి (కాంతారావు) ప్రాణస్నేహితులు. పరిస్థితుల కారణంగా సేతుపతి ఏకవీర (కె.ఆర్.విజయ) ను, వీరభూపతి మీనాక్షి (జమున) ను పెళ్ళి చేసుకుంటారు. నిజానికి సేతుపతి మీనాక్షిని, వీరభూపతి ఏకవీరను ప్రేమించి ఉంటారు. ఈ నలుగురి మధ్య అంతరంగ సంఘర్షణ చిత్రంలో ఆవిష్కరింపబడింది.
"https://te.wikipedia.org/wiki/ఏకవీర_(సినిమా)" నుండి వెలికితీశారు