"అద్వైతం" కూర్పుల మధ్య తేడాలు

7 bytes added ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
అవిద్య అపారమార్థికము, సదసద్విలక్షణము, జడము, సవికారము, సావయవము, అనాది సాంతము, అజ్ఞానరూపము. (అపారమార్థికము = మిథ్యా భూతము. బ్రహ్మతత్వజ్ఞానముచేత నివర్తించునది. ఇది వ్యావహారికసత్త అని చెప్పఁబడుచున్నది. వ్యవహారదశలో సత్తుగా తోఁచును కాని పరమార్థము కాదు. సదసద్విలక్షణము = సత్తనఁగా బ్రహ్మము, అసత్తనఁగా తుచ్ఛమయిన శశశృంగాది; పారమార్థికసత్తయిన బ్రహ్మముకంటెను ప్రమాణసిద్ధముగాని తుచ్ఛముకంటెను విలక్షణమైనది. బ్రహ్మమువలె పారమార్థికము కాదు, తుచ్ఛమువలె ప్రమాణములకు అవిషయమును కాదు.)
 
ఈయవిద్య సత్వరజస్తమోరూపగుణత్రయాత్మకము. దీనికి ఆచ్ఛాదకశక్తి, విక్షేపశక్తి అని రెండుశక్తులు ఉన్నవి. ఆచ్ఛాదకశక్తికలఆచ్ఛాదక శక్తికల యవిద్యచేత ఆవరింపఁబడిన బ్రహ్మమునకు చీఁకటిలో ఉన్నమనుష్యునకువలె స్వస్వరూపజ్ఞానము చెడి విక్షేపరూపమయిన దేవతిర్యఙ్మనుష్యాది భేదజ్ఞానము కలుగుచున్నది. ఈదేవాదిభేదములు అన్నియు అవిద్యాపరిణామములుగాని పరమార్థములు కావు.
 
ఈచైతన్యరూపమయిన బ్రహ్మము శుద్ధ చైతన్యము, మాయావచ్ఛిన్నచైతన్యము, అంతఃకరణావచ్ఛిన్నచైతన్యము, వృత్త్యవచ్ఛిన్నచైతన్యము, విషయావచ్ఛిన్నచైతన్యము అని అయిదు భేదములుగలది. శుద్ధమైన బ్రహ్మస్వరూపమునకు ఈభేదములు అవిద్య మొదలుగాఁగల యుపాధులచేత కలుగుచున్నవి.
ఇందు మాయావచ్ఛిన్నచైతన్యమైన యీశ్వరుఁడు మొదట సృజింపఁగల ప్రాణివర్గముల తారతమ్యమునకు హేతువగు కర్మములను తోడుచేసికొని అపరిమితశక్తియుక్తమైన మాయను వశపఱిచికొని నామరూపాత్మకమైన సకలప్రపంచమును సృజియింప సంకల్పించి మొదట ఆకాశాది పంచభూతములను అపంచీకృతములను పుట్టించెను. అందు ఆకాశమునకు శబ్దమును, వాయువునకు శబ్దస్పర్శములను, తేజస్సునకు శబ్దస్పర్శరూపములను, అప్పునకు శబ్దాదులతోడ రసమును, పృథివికి శబ్దాదులతోడ గంధములును గుణములు.
 
పృథివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశమును అను నీపంచభూతములును, గుణత్రయాత్మకమయిన యవిద్య యొక్క కార్యములుగాన ఇవియు త్రిగుణాత్మకములు. సత్యగుణయుక్తములు అయిన యీభూతములచేత త్వక్చక్షుశ్శ్రోత్ర జిహ్వాఘ్రాణములు అనెడి జ్ఞానేంద్రియములు, మనోబుద్ధ్యహంకారచిత్తములు అనెడి యంతఃకరణ పరిణామములును పుట్టుచున్నవి. రజోగుణయుక్తములు అయిన యీభూతములచేత వాక్పాణిపాదపాయూపస్థములు అనెడి కర్మేంద్రియములు పుట్టుచున్నవి. రజోగుణముతోకూడినరజోగుణముతో కూడిన భూతముల చేత ప్రాణాపాన వ్యానోదాన సమానములు అను పంచప్రాణములు పుట్టుచున్నవి.
 
ఈ పంచభూతములుచేతను, జ్ఞానకర్మేంద్రియములచేతనుజ్ఞానకర్మేంద్రియముల చేతను, పంచప్రాణములచేతనుపంచప్రాణముల చేతను, మనోబుద్ధులచేతనుమనోబుద్ధుల చేతను సూక్ష్మశరీరము పుట్టుచున్నది. ఈశరీరము లింగశరీరములింగ శరీరము అని చెప్పఁబడును. ఈశరీరము పరలోకయాత్రకుపరలోక యాత్రకు అనుకూలమై మోక్షపర్యంతము ఉండునది.
 
తమోగుణముతోడ కూడిన యపంచీకృత భూతములచేత పంచీకృతభూతములు పుట్టుచున్నవి. పంచీకరణము అనఁగా ఆకాశాది పంచభూతములను మొదల ప్రత్యేకము రెండుగాభాగించి అందు ఒక్కొక్క యంశమును నాలుగేసిగా భాగించి ఆనాలుగింటిలో ఒక్కొక్క భాగమును భాగింపని యొక్కొక్క సగముతో చేర్చి కలపఁగా పంచీకృతభూతములు ఏర్పడియె. అందు ఆకాశార్ధమును కడమభూతములలో ఎనిమిదింట ఒక్కొక్కభాగమును చేర్పఁగా పంచీకృతాకాశము. ఇట్లు వాయ్యాదులను ఊహింపవలయును.
2,14,106

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1440458" నుండి వెలికితీశారు