ప్రాణ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
'''ప్రాణ్ ''' ఒక ప్రముఖ భారతీయ నటుడు. తనదైన విలక్షణ శైలితో దాదాపు 400 చిత్రాలలో నటించాడు. దాదాపు ఆరు శతాబ్దాలపాటు ఇతని నట జీవితం సాగింది. కొన్ని తెలుగు చిత్రాలలో కూడా ప్రతినాయక పాత్రలను పోషించాడు.
==బాల్యం, విద్యాభ్యాసం==
ప్రాణ్ ఫిబ్రవరి 12, 1920న పాతఢిల్లీలోని బల్లిమరన్ అనే ప్రాంతంలో ఒక సంపన్న పంజాబీ కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి కేవల్ క్రిషన్ సికంద్ సివిల్ ఇంజనీరుగా ప్రభుత్వ కాంట్రాక్టరుగా పని చేసేవాడు. ఆయన తల్లి రామేశ్వరి. వారికి నలుగురు కొడుకులు మరియు ముగ్గురు కూతుళ్ళు.
 
ప్రాణ్ చిన్నతనంలో చదువులో ముఖ్యంగా గణితంలో మంచి ప్రతిభ కనబరిచాడు. తండ్రి ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో నివసించాల్సి రావడంతో ఆయన డెహ్రాడూన్, కపుర్తలా, మీరట్ లాంటి అనేక ప్రదేశాల్లో చదివాడు. చివరగా మెట్రిక్యులేషన్ ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ లో పూర్తిచేశాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రాణ్" నుండి వెలికితీశారు