స్వర్ణ దేవాలయం, శ్రీపురం: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
చి clean up using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}ఈ దేవాలయములో గర్భగుడికి మూడు వైపులా నీరు , ఒకవైపు ద్వారం వుంటుంది. ఆ నీటిని పవిత్రంగా భావిస్తారు. ప్రతి శుక్రువారం గుడిని అందంగా అలంకరితరు
[[File:Sripuram Temple Full View.jpg|thumb|right|250px|శ్రీపురం లోని బంగారు గుడి
[[శ్రీపురం స్వర్ణదేవాలయం]] ఇటీవలే నిర్మించిన స్వర్ణ దేవాలయం. తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు కు దగ్గర్లో మలైకుడి అనే ప్రాంతానికి దగ్గర్లో కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది. [[చెన్నై]] నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. <ref>http://www.sripuram.org</ref>. దీని నిర్మాణానికి ''నారాయణి అమ్మ'' అనే స్వామి నేతృత్వం వహించాడు. ఆయన్ను శక్తి సిద్ధ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆలయం 55000 చదరపు అడుగుల వైశాల్యం లోనిర్మించబడింది. దీని గర్భగుడి సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలుసిసలైన బంగారంతో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉండటం చేతనే దీనికి బంగారు గుడి అని పేరు వచ్చింది. <ref name="newssource">https://archive.is/20130629215143/www.monstersandcritics.com/news/india/news/article_1347148.php/Tamil_Nadu_gets_a_golden_temple</ref>. ఆలయ ఆవరణం మొత్తం నక్షత్రం ఆకారం గల ప్రాకారంతో ఆవరించబడి ఉంటుంది.
 
గుడిలోకి ప్రవేశించే దారి పొడవునా [[భగవద్గీత]], [[ఖురాన్]], [[బైబిల్]], [[గురుగ్రంథ్ సాహిబ్]] నుంచి సేకరించిన శ్లోకాలు పొందుపరచబడి ఉంటాయి. ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చే భక్తుల దర్శనాన్ని పర్యవేక్షించడానికి సుమారు 700 మంది పోలీసులను ప్రభుత్వం నియమించింది. ఇక్కడ ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు చెయ్యరు. ''శ్రీ విద్య'' అనే ప్రాచీనమైన మరియు అరుదైన శక్తి పూజా విధానాన్ని అనుసరిస్తారు.
 
నారాయణి అమ్మ ఏర్పాటు చేసిన సంస్థకు సుమారు ఆరు దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులు దీని ద్వారానే సమకూరాయాని ఆయన తెలియజేశారు. ఆయన అంతకు మునుపే పేదరిక నిర్మూలనకూ, వికలాంగులకూ సహాయం చేశాడు. మూడు కోట్ల రూపాయలతో చుట్టుపక్కల ఉన్న దాదాపు 600 దేవాలయాలను జీర్ణోద్ధరణ గావించాడు.<ref name="newssource" />
 
[[వర్గం:హిందూ దేవాలయాలు]]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
*[http://www.sripuram.org/ శ్రీపురం ఆలయం అధికారిక వెబ్‌సైటు]]
 
[[వర్గం:హిందూ దేవాలయాలు]]