బీబి నాంచారమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up using AWB
పంక్తి 1:
[[దక్షిణ భారతదేశం]]లో ప్రచారంలో ఉన్న జానపదాల ప్రకారం '''బీబి నాంచారమ్మ''' లేదా '''తుళుక్క నాచ్చియార్''' (తురుష్క దేవత) అనే ముస్లిం స్త్రీ శ్రీవేంకటేశ్వరుని రెండవ భార్య.
"బీబీ" అనేది ఉర్దూ పదం. "నాంచారి" తమిళం. రెండింటికీ ఒకటే అర్ధం. ఈ "బీబీ నాంచారమ్మ" గురించి వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి. బీబీ నాంచారమ్మకి [[కనకదుర్గ]] ఆడపడచు అట.<ref>1980-1990వరకు 9వ తరగతి తెలుగు నాన్ డిటైల్డ్ లో పాఠం </ref>. భూదేవి బీబీ నాంచారిగా అవతారమెత్తి శ్రీహరికోసం వెతుకుతూ వచ్చిందట. <ref>అలమేలుమంగా విలాసం http://www.hindu.com/fr/2007/06/01/stories/2007060152210300.htm </ref> నాంచారమ్మ వృత్తాంతము ఒక జానపద కథ అని, భారతదేశాన్ని మహమ్మదీయుల పాలించిన కాలంలో తిరుమల దేవస్థానాన్ని ముస్లిం దండయాత్రలనుండి రక్షించడానికి ఈ కథను సృష్టించారని భావిస్తున్నారు. 1780లో చంద్రగిరిని పట్టుకొన్న [[హైదరాలీ]] తిరుమల సంపదను కన్నెత్తి చూడకపోవడానికి కారణం ఈ కథలేనని ఒక అభిప్రాయం. బీబీ నాంచారమ్మ కథను విశ్వసిస్తూ చాలామంది మహమ్మదీయులు నేటికీ తిరుమలను దర్శించుకుంటున్నారు.
తుళుక్క నాచ్చియార్ విగ్రహ రూపంలో తిరుమలలోను, శ్రీరంగంలో రంగనాథాలయంలోనూ, మేళ్కోటెలోని చెళువనారాయణస్వామి ఆలయంలోనూ పూజలందుకుంటున్నది. శ్రీరంగంలో రంగనాధుని ఆలయంలో తుళుక్కు నాచియార్ గుడి ఉంది. వైష్ణవానికి రాజధాని అయిన శ్రీరంగంనుండి తిరుమలకు ఎగుమతి అయిన దేవతలలో బహుశా బీబీనాంచారమ్మ ఒకరు.
 
పంక్తి 15:
*ప్రొద్దుటూరుకు చెందిన డా.సి.వి.సుబ్బన్న శతావధాని రచించిన "బీబీ నాంచారి ప్రబంధము" తిరుపతిలో తెలుగు భాషోధ్యమ సమితి ఆధ్వర్యంలో 25.4.2010 న ఆవిష్కరణ జరిగింది.కర్నాటకలోని మేల్కోటే లోని చెళ్ళపిళ్ళరాయుని విగ్రహాన్ని ఢిల్లీ సుల్తాన్ ఢిల్లీ కి తెప్పిస్తాడు.ఆ విగ్రహాన్ని ఆయన కుమార్తె ఆరాధిస్తుంది.ప్రేమలో పడుతుంది.వెంకటేశ్వరుడు సుల్తాన్ కు కలలో కనపడి ఆయన కుమార్తెను వివాహమాడతానని చెపుతాడు.సుల్తాన్ అంగీకరిస్తాడు.గోదాదేవి లాగానే నాంచారి కూడా విష్ణుపత్నిగా ఆరాధించ బడుతుంది.వెంకటేశ్వరుడు లౌకికవాదానికి ప్రతీకగా మారి [[మతాంతర వివాహాలు]] కు మార్గం సుగమం చేసి మార్గదర్శకుడయ్యాడని శతావధాని చెప్పారు.<ref>http://beta.thehindu.com/arts/books/article415269.ece</ref>
 
* తాళ్ళపాకనుండి తిరుమల వరకు దాదాపు అన్ని క్షేత్రాలను, ఆచారాలను ప్రస్తావించిన 16వ శతాబ్దానికి చెందిన [[అన్నమయ్య]], తలనీలాలు ఇవ్వడం గురించి, బీబీ నాంచారి గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనింపదగిన విషయం.<ref>తిరుమల కొండ పదచిత్రాలు - పున్నా కృష్ణమూర్తి </ref>
 
*:వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ
పంక్తి 22:
:పాపసాబు మాట పైడిమూట ---- [[తక్కెళ్ళపల్లి పాపాసాహెబ్‌]] 1949 <ref>http://www.eenadu.net/sahithyam/display.asp?url=kavya9.htm</ref>
 
* [[ పింగళి నాగేంద్రరావు]]
:నాపాలి దైవమని నమ్ముకున్నానయ్య
:నా భాగ్యదేవతా నను మరువకయ్యా
పంక్తి 31:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
{{తిరుమల తిరుపతి}}
"https://te.wikipedia.org/wiki/బీబి_నాంచారమ్మ" నుండి వెలికితీశారు