తవుడు నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
===తవుడు నుండి అయిల్‌ను సంగ్రహించడం===
 
తవుడునుండి ఆయిల్‌ను హెక్సెన్‌ను సాల్వెంట్‌గా ఉపయోగించి తీయుటను 'సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షన్' (solvent extraction) అంటారు<ref>{{citeweb|url=http://lipidlibrary.aocs.org/processing/solventextract/index.htm|title=SOLVENT EXTRACTION|publisher=lipidlibrary.aocs.org|date=|accessdate=2015-03-08}}</ref>. హెక్సెన్‌ అల్కెన్ గ్రూప్‌నకు చెందిన ద్రవహైడ్రొకార్బన్‌. హెక్సెన్ తక్కువబాయిలింగ్‌ పాయింట్‌ కలిగివుండటం, టాక్సిన్స్ (విష కారకాలు) లేకపోవడం, విస్తారంగా లభించడంవలన సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ ప్లాంట్‌లలో[[ హెక్సెను| హెక్సెన్‌]] సాల్వెంట్‌గా వాడెదరు<ref>http://www.thefreedictionary.com/hexane</ref>. తవుడు పౌడరుగా వుండటంవలన నేరుగా ఆయిల్‌ను ఎక్స్‌ట్రాక్ట్ చెయ్యుటకు కుదరదు. అందుచే తవుడును మొదటగా గుళికలుగా (Pellets) తయారు చేసి, ఆతరువాత ఈపిల్లెట్స్‌ను ఏక్స్‌ట్రాక్టరుకు పంపి, అక్కడ హెక్సెనును స్ప్రే చేసి తవుడునుండి నూనెను తీయుదురు.
 
తవుడును గుళికకలుగా మార్చు యంత్రాన్ని పెల్లెటైజరు (Pelletiser) లేదా కూబర్ మెచిన్ (cuber machine) అనెదరు<ref>[https://www.google.co.in/search?q=rice+bran+pellets&espv=210&es_sm=93&tbm=isch&tbo=u&source=univ&sa=X&ei=8YFmUtz9BcP7rAfA6YH4CQ&ved=0CEoQsAQ&biw=1366&bih=677]పెల్లటైజరు</ref> . పెల్లెటైజరులో సాధారణంగా కాస్ట్‌ఐరన్‌ (cast iron)తో చేసిన డై ప్లేట్‌ (Die plate) మరియు, రోలరులు వుండును.డై ప్లెట్‌కు 6-8 వ్యాసం(Diameter)వున్న రంధ్రాలుండును.డై ప్లేట్‌ మందం 55-60 మి.మీ. వుండును.ఈ డై ప్లెట్‌మీద 4-6 రోలరులు బిగించబడి వుండును.వీటి డయా 280 మి.మీ.లు వుండి, వెడల్పు 100-160 మి.మీ వరకు పెల్లెటైజర్‌ ఉత్పత్తి సామార్ద్యంనుబట్టి వుండును. డై ప్లేట్‌డయా కూడా మెషిన్‌ కెపాసిటిని బట్టి 600-840 మి.మీ. వుండును. పెల్లెటైజరుకు తవుడును పంపించెముందు, తవుడును టెంపరింగ్‌ కన్వెయరు (Temparing conveyer)లో ఒపన్‌స్టీమ్ ద్వారా కుకింగ్‌ చెయ్యుదురు. ఒపన్‌స్టీమ్‌ ద్వారా తవుడును కుకింగ్‌ చెయ్యడంవలన తవుడులోని తేమ (Moisture) శాతం 15% వరకు పెరగడంవలన పెల్లెట్స్ సుభంగా ఏర్పడుతాయి. పెల్లెటైజెర్ తిరుగునప్పుడు, డై ప్లెట్‌తో పాటు రోలరులు తిరుగును. డై ప్లేట్ భ్రమణ వేగం (Revolution) 90-100/నిమిషానికి వుండును. కుకింగ్ అయ్యిన తవుడు పెల్లెటైజెర్ డై ప్లెట్‌ మీద పడినప్పుడు,రోలరులు తవుడును అధిక వత్తిడితో డైప్లెట్ మీద నొక్కడం/వత్తడం వలన, తవుడు పెల్లెట్‌లగామారి డై ప్లెట్‌ రంధ్రాలనుండి బయటకు వచ్చును. పెల్లెటైజరునుండి తయారు అయ్యివచ్చు పెల్లెట్‌ల ఉష్ణోగ్రత 80-85 డిగ్రీలి/సెంటిగ్రెడ్‌ వుండును. డై ప్లెటుకు దిగువన ఒకకట్టరును బిగించి, పెల్లెట్స్‌ను కావలసిన సైజుకు కత్తరించడం జరుగును. బ్రాన్‌పెల్లెట్స్‌ను సాల్వెంట్ ప్లాంట్‌కు పంపెముందు, పెల్లెట్స్ ఉష్ణోగ్రతను, మరియు పెల్లెట్స్ యొక్క మాయిచ్చర్‌ను తగ్గించవలసి వున్నది. అందుచే పెల్లెట్‌లను పెల్లెట్‌ కూలర్‌ (pellet cooler) అనే యంత్రపరికరంకు పంపించి, పెల్లెట్‌ల ఉష్ణోగ్రతను 45-50 సెంటిగ్రెడ్‌ డిగ్రీల వరకు కూల్‌చెయ్యుదురు.పెల్లెట్‌కూలరులో పెల్లెట్స్‌ వెళ్లునప్పుడు, ఎయిరు బ్లొవర్‌ (Air Blower) ద్వారా చల్లనిగాలిని ప్రసరింప చెయ్యడం వలన పెల్లెట్స్ చల్లబడును. అంతియేకాదు, పెల్లెట్స్ యొక్క తేమ శాతం కూడా 12% వరకు వచ్చును. పెల్లెట్‌కూలరులో చల్లబరచిన పెల్లెట్స్ ఒకకన్వెయెర్ (conveyer)ద్వారా సాల్వెంట్‌ప్లాంట్‌కు వెళ్ళును.
"https://te.wikipedia.org/wiki/తవుడు_నూనె" నుండి వెలికితీశారు