పన్నాలాల్ పటేల్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up using AWB
పంక్తి 8:
| birth_place = [[Dungarpur]], [[రాజస్థాన్]]
| death_date = {{death date and age|1989|4|6|1912|5|7|mf=y}}
| death_place = [[Ahmedabad]], [[గుజరాత్]], [[Indiaభారత దేశము]]
| occupation = నవలా రచయిత
| nationality = భారతదేశం
పంక్తి 36:
పన్నాలాల్ పటేల్ రచనల్లో గ్రామజీవనంలోని ఆచార వ్యవహారాలు, పంటలు క్షామాలు, నీతి అవినీతులు వంటివాటిని ప్రతిబింబించారు. ప్రముఖ గుజరాతీ సాహిత్యవిమర్శకులు దర్శక్ పన్నాలాల్ రచనల గురించి మాట్లాడుతూ పాత్రల వ్యక్తిగత కష్టాలనే కాక వాటి నుంచి కాలచక్రంలోని మార్పులను, వాటికి ఆధారకేంద్రాలైన స్థానాలను నవలల ద్వారా చూపగలిగారని పేర్కొన్నారు. వ్యక్తిగత కార్యకలాపాల వల్ల లభించే సుఖదుఃఖాల కన్నా సాంఘిక కార్యకలాపాల వల్ల లభించే కష్టసుఖాల పరిమాణం పెరుగుతుందని, ఈ అంశాన్ని పన్నాలాల్ పటేల్ నవలల్లో చిత్రీకరించారని వారు వివరించారు. అశాంతి, దోపిడీ, దైవ అననుకూలత వల్ల వచ్చే ఆపదలు, షావుకార్ల ఒత్తిడి, రాచరికం, ధనమదం వీటన్నిటి పదఘట్టనల కింద నలుగుతూ, ఎప్పుడూ వాటి వల్ల బాధపడుతూ కూడా బతుకుపై మమకారంతో ఆడుతూ పాడుతూ ఆనందంగా జీవితం గడిపే పల్లెటూరి కష్టజీవుల కథలను ఇతివృత్తంగా స్వీకరించారని విమర్శకులు పేర్కొన్నారు.
== పురస్కారాలు, గుర్తింపు ==
''మానవీనీ భవాయీ'' నవలకు గాను [[పన్నాలాల్ పటేల్]] కు 1985 సంవత్సరంలో ప్రతిష్టాత్మక [[జ్ఞానపీఠ్ పురస్కారం]] లభించింది. ఈ పురస్కారాన్ని అందుకున్న రెండవ గుజరాతీ సాహిత్యవేత్తగా ఆయన కీర్తిగడించారు. 1950లో గుజరాతీ సాహిత్యరంగంలో అత్యున్నత పురస్కారంగా ప్రఖ్యాతి పొందిన [[:en:ranjitram suvarna chandrak|రంజిత్ రాం సువర్ణ చంద్రక్]](రంజిత్ రాం బంగారు పతకం) పొందారు. పన్నాలాల్ పటేల్ రచించిన ''వళా మణా''(వీడ్కోలు), ''మళేలా జీవ్''(ప్రియ జనులు)నవలలను చదివిన తన్మయత్వంలో ప్రముఖ గుజరాతీ సాహిత్యవేత్త ఝవేర్ చంద్ మేఘాణీ ఆ నవలల విశిష్టతను తెలుపుతూ వ్యాసాలు రచించారు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు}}
 
[[వర్గం:జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు]]
[[వర్గం:రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/పన్నాలాల్_పటేల్" నుండి వెలికితీశారు