సంస్కృతం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 5:
|pronunciation= సంస్కృతం
|region=[[భారతదేశం]]
|speakers=14,135 (2001 జనాభా లెక్కల ప్రకారం) <ref>2001 భారత జనాభా లెక్కలు[http://www.censusindia.gov.in/Census_Data_2001/Census_Data_Online/Language/Statement1.htm] భారతదేశంలో 14,135 మంది సంస్కృతాన్ని అనర్గళంగా మాట్లాడగలరు </ref>
|script=[[దేవనాగరి]] (''de facto''), various [[బ్రాహ్మీ లిపి]]-[[Brahmic family of scripts|based]] scripts, and [[Romanization of Sanskrit|Latin alphabet]]
|nation= [[భారతదేశ ఆధికారిక భాషలు]]
పంక్తి 12:
[[దస్త్రం:Phrase sanskrit.png|thumb|right]]
'''సంస్కృతము''' (संस्कृतम्) [[భారతదేశం|భారతదేశానికి]] చెందిన ప్రాచీన [[భాష]] మరియు భారతదేశ 23 [[భారతదేశ అధికారిక భాషలు|ఆధికారిక భాషల]] లో ఒకటి. పరమేశ్వరుని ఢమరుక నాదము నుండి వెలువడిన శబ్ద బ్రహ్మమే సంస్కృత భాష అని విజ్ఞులందురు. అట్లు వెలువడిన పదునాలుగు రకములైన సూత్రములను మాహేశ్వర సూత్రములందురు. సంస్కృతం హిందూ, బౌద్ధ మరియు జైన మతాలకు ప్రధాన భాష. [[నేపాల్|నేపాలు లో]] కూడా సంస్కృతానికి భారతదేశములో ఉన్నటువంటి స్థాయియే కలదు. జనాభాలెక్కల ప్రకారం సంస్కృతం మాట్లాడేవారి జనాభా: * 1971-->2212 * 1981-->6106 * 1991-->10000 * 2001-->14135.
<br /> అని ఉన్నా కనీసం పది లక్షల కంటే ఎక్కువ మందే సంస్కృతాన్ని అనర్గళంగా మాట్లాడగలరు. కర్ణాటకలోని [[http://undiscoveredindiantreasures.blogspot.in/2012/05/mattur-village-where-people-converse-in.html మత్తూరు]] అనే గ్రామములో పూర్తిగా సంస్కృతమే వ్యవహారభాష.
సంస్కృతం అంటే 'సంస్కరించబడిన', 'ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన' అని అర్థం .ప్రపంచంలోని 876 భాషలకు సంస్కృతం ఉపజీవ్యం. సంస్కృతమునకు అమరవాణి, దేవభాష, సురభాష, గీర్వాణి మొదలగు పేర్లు కలవు. శౌరసేని, పైశాచి, మాగధి మొదలగు ప్రాకృత భాషలు కూడా సంస్కృతము నుండియే పుట్టినవి. సంస్కృతమునందు ఏకవచనము, ద్వివచనము, బహువచనము అను మూడు వచనములు కలవు. సంస్కృతమునందు నామవాచకములను విశేష్యములనియు, శబ్దములనియును, క్రియాపదముల యొక్క మూలరూపములను ధాతువులనియును వ్యవహరింతురు. సంస్కృతాన్ని మొదట సరస్వతీ లిపిలో వ్రాసేవారు. కాలక్రమేణ ఇది [[బ్రాహ్మీ లిపి]] గా రూపాంతరం చెందింది. ఆ తర్వాత [[దేవనాగరి]] లిపిగా పరివర్తనం చెందింది. ఇదే విధంగా [[తెలుగు లిపి]], [[తమిళ లిపి]], [[బెంగాలీ లిపి]], [[గుజరాతీ లిపి]], [[శారదా లిపి]] మరియు అనేక ఇతర లిపులు ఉద్భవించాయి. క్రియా పదముల యొక్క లింగ, వచన, విభక్తులు నామవాచకమును అనుసరించి ఉండును.
===సంస్కృతభాషావైభవము===
పంక్తి 26:
ఆదిలో ఇండో యూరోపియన్ భాషా సాదృశ్యశాస్తములో కృషిచేసిన వారిమతమున, సంస్కృతము నిస్సంశయముగ మాతృభాషగనే యుండెను. పిమ్మట నేకారణముచేతనోకాని పాశ్చాత్యపండితులు సంస్కృతమునకు మాతృస్ధానమును తొలగించి, అది యూరోపియన్ భాషలతో పోదరీ సంబంధమునే కలిగియున్నదను సిద్ధాంతమును లేవదీసిరి. ఇట్లు చెప్పిన పాశ్చాత్యపండితులుగూడ నొక్కయంశమునంగీకరింపక తప్పినదికాదు. ఈయక్కచెల్లెండ్రకు తల్లియైన భాషను మిక్కిలి హెచ్చుగ బోలియున్నది సంస్కృతమే కాని మరొకటికాదని వారనుచున్నారు. నిజమైనతల్లి యిపుడు మృగ్యమనియు, చాల విషయములలో నది సంస్కృతమును పోలియుండునని మనమూహించుకొనవచ్చుననియు, విమర్శకులు నుడువుటచే వివిధ యూరపీయభాషలకు సంస్కృతము కీలకమను అంశము వ్యక్తమగుచున్నది.
 
రాజకీయముగా భారతదేశము పాశ్చాత్యుల అధీనమయిన కాలములో, పాశ్చాత్యులు భారతీయభాషయే తమ భాషకు తల్లియని అంగీకరించుచో, అది విపరీతముగ నుండెడి మాట వాస్తవమే. అట్లొప్పుకొనుట పాలకజాతివారి గర్వమునకు భంగకరమును, పాలితజాతివారి ఆత్మగౌరవమునకు ఉద్దీపకమును అగును. అయినను ఉదారులగు పాశ్చ్యాత్యులు కొందరు సత్యమును బాహాటముగా చాటిరి. విమర్శకులలో ఉన్నతశ్రేణికి చెందిన కర్జన్ పండితుడు వ్రాసిన మాటల నిట ఉల్లేఖించుచున్నాను.
 
“గ్రీకు, లాటిను, గొతిక్ మొదలైన భాషలన్నియు భిన్న, భిన్న కాలములయందు సంస్కృతభాషనుండియే, ముఖ్యముగా వైదిక సంస్కృతమునుండియే, ఉద్భవించినవి.” (Journal of Royal Asiatic Society of Britain and Ireland అను ప్రసిద్ధ పత్రికలో ః 16 వ సంపుటము ప్రధమ భాగములో 177 వ పుట).
పంక్తి 42:
====విజ్ఞానభాండారము====
 
సంస్కతభాష సమస్త భాషలకు మాతయైనట్లే, సంస్కృతభాషాఘటితమైన విజ్ఞానముకూడ సమస్తదేశ ప్రాచీన విజ్ఞానమునకు మూలమైయున్నది. విజ్ఞాన ప్రవాహము భారతదేశమునుండి బయలుదేరి యేరీతిగా పర్షియా, అరేబియా, గ్రీసు మున్నగు దేశములకు వ్యాపించినదో విపులముగా వివరించుచు పోకాక్ అను ఆంగ్లేయుడు India in Greece అను గ్రంథములో నిరూపణచేసియున్నాడు. బాబిలోనియా, ఈజిప్టు మున్నగు దేశములలో అతిప్రాచీననాగరికత యని భావింపబడుచున్నది భారతదేశసంస్కృతియొక్క విస్తారమే యని ఆ గ్రంథములో వివరముగా తెలుపబడినది. ఈ గ్రంథము రచింపబడి నూరు సంవత్సరములగుచున్నది. ఇంత సహేతుకముగా సప్రమాణముగా ప్రపంచనాగరికత భారతీయనాగరికతా విస్తారమేయని నిరూపించిన గ్రంథమునకు దేశములో వ్యాప్తిలేకుండుట ఆశ్చర్యముగానున్నది. ఆ గ్రంథము వ్యాప్తిలోనికి వచ్చుచో భారతీయవిజ్ఞానముపట్ల భారతీయులయొక్కయు, ప్రపంచవాసులయొక్కయు దృక్పథములో మూలమట్టమైన మార్పువచ్చును.
 
ప్రపంచములోని యేభాషలోను వాజ్ఞయము పుట్టక పూర్వమే, సంస్కృతములో వాజ్ఞయము బయలుదేరినదని ఎల్లరు నంగీకరించుచున్నారు. మానవ పుస్తకభాండాగారములో ఋగ్వేదమే మొదటిగ్రంథమని మాక్సుముల్లరు నుడివియున్నాడు.
పంక్తి 57:
సంస్కృతభాషయొక్క కట్టుబాటును గురించి మోనియర్ విలియమ్స్ యిట్లు పల్కినాడు. “ఇంతవరకు ప్రపంచములో బయలుదేరిన అద్భుతగ్రంథములలో పాణినివ్యాకరణమొకటి. స్వతంత్ర ప్రతిభ లోను, సూక్ష్మ పరిశీలనలోను పాణినీయ వ్యాకరణముతో పోల్చదగిన గ్రంథమును మరియే దేశమును సృజించుకొనలేదు”.
 
భాషను నిబంధించు వ్యాకరణశాస్త్రము ఒక శాస్త్రముగా పరిగణింపబడు ఉన్నతస్ధితికి వచ్చుట భారతదేశములో మాత్రమే జరిగినది. సంస్కృతవ్యాకరణమునుగూర్చి యీరీతి వర్ణనను "Most Scientific Grammar” అని అనేక పాశ్చాత్యపండితులు గావించియున్నారు. బుద్ధికి శిక్షణము నొసగు విషయములలో గణితశాస్త్రమొకటి. గణితశాస్త్రమునుగాని, సంస్కృతవ్యాకరణమునుగాని చదువుచో మానవబుద్ధి సరియైన మార్గములో ఆలోచించుటయను అలవాటులో పడునని నిష్పక్షపాతబుద్ధి గల పాశ్చాత్యులే నుడివియున్నారు.
 
బహుభాషానిబద్ధ సాహిత్యకృషి చేసినవారు ప్రపంచసాహిత్యములో వాల్మీకి రామాయణముతో సమానమైన గ్రంథము లేదనిరి. ఆంగ్లములో గ్రంథకర్తగా ప్రసిద్ధిచెందిన భూతపూర్వ బీహార్ రాజ్యపాల శ్రీ ఆర్. ఆర్. దివాకర్ ఇట్లు వాక్రుచ్చినారు. “కొందరు నాతో ఏకీభవించినను, ఏకీభవింపకపోయినను నామట్టునకు నాకు ప్రపంచసాహిత్యములో వాల్మీకి రామాయణము ఉత్తమోత్తమ గ్రంథమనిపించుచున్నది.” (ఆంధ్రపత్రిక 21-7-57 ) . ఇట్టి బహువిషయములలో అగ్రస్థానము మరి యేభాషకును లభించుట లేదు.
పంక్తి 67:
“Nowhere else are the aesthetic and the didactic so harmoniously blended as in the Ramayana”.
 
ఈ విషయములో రామాయణమునే వరవడిగా నుంచుకొని సంస్కృతకావ్య నాటకాదులు బయలుదేరినవనుట స్పష్టము. ఆలంకారికులుకూడ ఈలక్ష్యమునే ఆదేశించినారు. ప్రతాపరుద్ర యశోభూషణములో విద్యానాథడు రచించిన "యద్వేదాత్ప్రభుసమ్మితాదధిగతం” ఇత్యాది శ్లోకసందర్భమును పరికింపదగును.
 
పాఠకుని హృదయము ఆనందసముద్రములో ఓలలాడుటతో బాటు, ధర్మసౌధశిఖరమును సోపానక్రమముచే అధిరోహించుట రామాయణ పఠనసమయములోనేకాక కాళిదాసాది ఇతర సంస్కృతకవుల గ్రంథములను పఠించు సమయములో కూడ అనుభవగోచరము.
 
అట్టి గ్రంథములే యింతకాలము భారతీయులను సత్వగుణ ప్రధానులనుగ చేసి, వారికి ప్రపంచములో నొక విశిష్టతను చేకూర్చినవి. ఆధునిక కాలములో (సైన్సు) విజ్ఞానము పర్వతరాశివలె పెరిగిపోయినది. దానిప్రక్కను భారతీయ సంస్కృతియను మరొకపర్వతమున్నది. ఈ సంస్కృతిచే పరిమళింప చేయబడని ఆధునికవిజ్ఞానమును మనముపయోగించుకొందుమేని అది యిప్పటిరీతిగానే ప్రపంచమునకు శాంతి ప్రదానశక్తిలేక, కల్లోలస్ధితికే కారణమగుచుండును. ఈరెండు పర్వతములను కలుపగల వంతెనయే సంస్కృతభాష. భారతరామాయణగాధలు, బోధలును, కాళిదాసాదికవుల గ్రంథములలోని మధురసందేశమును, భర్తృహరి సుభాషితాది హృదయంగమోపదేశములును నేటి విజ్ఞానపర్వతమునకును, భారతీయజీవిత పథమను సంస్కృతికిని సేతుబంధముగా పనిచేయగల్గి ఆధునికనాగరికతలో నూతనయుగము నావిర్భవింపచేయ గలవు. ఇట్టి సేతువును నిర్మింపవలసిన యావశ్యకతను రాష్ట్రపతి శ్రీ రాజేంద్రప్రసాదుగారు 1952 వ సంవత్సరములో కాశీలోజరిగిల\న సంస్కృత విశ్వపరిషదధివేశమునకు అధ్యక్షతను వహించుచు, స్పష్టపరిచి యున్నారు.
 
నైతికముగాను, ధార్మికముగాను సంస్కృతము మానవులకు గల్గింపగల యభ్యున్నతి నిరుపమానమైనది. ప్రపంచములో నెక్కడెక్కడ సంస్కృతము ప్రాకినదో, అక్కడక్కడ మానవహృదయమునకు మృదుత్వమేర్పడినదని రవీంద్రనాధటాగోరువంటి విశ్వమానవ సమదృష్టిగల విశ్వకవికూడ నుడివియుండుట గమనింపదగిన విషయము. భారతదేశములో ఫిన్లెండు రాజదూతగానుండిన హ్యూగోవల్వనే చెప్పిన యీ క్రిందిమాటలు సంస్కృతముయొక్క యీప్రభావమును ఘంటాపథముగ చాటుచున్నవి. “సంస్కృతభాషా నిబద్ధములైన భారతీయభావములు యూరపు హృదయమునకు మృదుత్వము నొసగినవి. అచట నాగరికతను నెలకొల్పినవి. ప్రత్యక్షముగా సంస్కృతభాషాద్వారముననే కాక భాషాంతరీకరణముల ద్వారమునకూడ నీపనిజరిగినది. తరువాత కొన్ని శతాబ్దములపాటు సంస్కృతము యూరపియనులకు అందలేదు.” (11-2-53 తేదీని కాశీలో ప్రభుత్వ సంస్కృత కళాశాలా స్నాతక సభోపన్యాసము).
పంక్తి 81:
పైన పేర్కొనబడిన ఫిన్లెండ్ రాయబారి తన ప్రభుత్వము తన్ను భారతదేశమునకు రాజదూతగా పంపిన కారణమును కాశీ విశ్వసంస్కృత పరిషదధివేశములో నిట్లు వివరించెను. 'మా దేశపు ప్రభుత్వము సంస్కృతభాషను నేర్చినవాని నెవనినయినను భారతదేశమునకు దూతగా పంపిన బాగుండునని తలంచుచుండెను. నేను 35 సంవత్సరముల క్రిందట, మా దేశములో విశ్వవిద్యాలయములో సంస్కృతము నభ్యసించితిని. కావున ఈ ఉద్యోగమునకు నేను ఎంచుకొనబడుట సంభవించెను'. భారతదేశముతో సంబంధము పెట్టుకొనదలచిన పాశ్చాత్యులకే సంస్కృతభాషాజ్ఞానమంత ముఖ్యముగా భావింపబడుచుండగా, స్వయముగా భారతీయులకా భాష యెంతముఖ్యమో, అది యెంతగా ప్రాణసమానమైనదో వేరుగ చెప్పనక్కరలేదు.
 
ఆసేతు హిమాచలము గల ప్రజలు ఏకజాతిగ నిబద్ధమగుటలో విశేషముగ తోడ్పడినది సంస్కృతభాష. రాజకీయ శాస్త్రములో జాతీయతకు(Nationhood) కావలసినవిగ చెప్పబడిన యంశములలో భాషైక్యమొకటి. ప్రాచీనభరతఖండములో ప్రాంతీయభాషలుండినను వివిధప్రాంతముల నడుమ సామాన్యభాషగా నుండినది సంస్కృతమే. పండితులలో సంస్కృతము సామాన్య భాషగా వాడబడుట నేటికిని గలదు. స్వచ్ఛ సంస్కృతము రాని భిన్నప్రాంతముల వారు సమావేశమైనప్పుడుకూడ వారు పరస్పరము అవగాహనము చేసికొనవలయునన్నచో వారివారి భాషలలో సామాన్యముగనుండు సంస్కృత పదజాలమే సహాయము చేయును. ఒక యాంధ్రుడును బీహారు ప్రాంతవాసియు నొకచోట కలిసినప్పుడు ఆంధ్రుడు బీహారీని "మీ నివాస మెక్కడ?” అని తెలుగులో అడిగినను అతని కర్థమగును. నివాస శబ్దము రెండు భాషలలోను సమానమే. 'భోజనము', 'శ్రమ', 'దానము' మున్నగు సామాన్యముగా వాడబడు పదములు రెండు భాషలలోను ఉండును. కావున భాషా భేదమున్నను, భారతీయు లెల్లరు సంస్కృతపద సూత్రబద్ధులై భాషైక్యముగూడ పొందియున్నారు.
 
సంస్కృతభాషవలెనే తద్భాషా నిబద్ధమైయున్న విజ్ఞానముకూడ భారతదేశమున కైక్యమును సాధించినది. రామాయణము, మహాభారతము, భర్తృహరి సుభాషితములు మున్నగునవి భారతదేశములోని ఏప్రాంతమువారికైను సమాన పరిచితములే; వానినిచూచి యుప్పొంగని భారతీయుడు లేడు. సంస్కృతభాషను కాళిదాసాదివిరచితశ్లోకములద్వారమున నేర్పు సంప్రదాయమొకటి మన దేశములో నున్నది. దీనివలన సంస్కృతము, సంస్కృతి కూడ ఒకేసారి బాలబాలికల హృదయములో ప్రవేశించు సదవకాశము కల్గును. జీవితకాలమంతయు జ్ఞప్తియందుంచుకొనవలసిన రసవంతములైన శ్లోకములద్వారా భాష నేర్చుకొనుటవలన యువకులు వానిని కంఠస్థముచేయుటయు, జీర్ణించుకొనుటయు సంభవించును. నేటి పాఠ్యపుస్తకములద్వారా సంస్కృతము నేర్చుకొనుచో నీ ప్రయోజనము బోవును. మహాకవుల గ్రంథములు బాలురకు బోధపడునాయనుశంకకు అవకాశము లేదు. ప్రపంచములో ఏభాషకును లేని విశేషమొకటి సంస్కృతభాషకు కలదు. ఈభాషలో మహోన్నతకవులే మహాసులభకవులు. వాల్మీకి, కాళిదాసు లెంతగొప్పవారో అంత సులభులు. కావున ఈ విషయమున సంస్కృతభాష మరొక భాషతో పోల్చదగినదికాదు.
పంక్తి 94:
సంస్కృతము మృతభాష కాకుండుటయేకాక మాధుర్యభరితమై యున్నందున అమృతభాషయని చెప్పదగియున్నది.
 
హిందూమతముతో బాటు సంస్కృతమును జీవింపక తప్పదు. సంస్కృతవిరహితమైన హిందూమతము ఊహకుకూడ అందనిది. హిందువుల మతగ్రంథములన్నియు - వేదములు, పురాణేతిహాసములు, భాష్యములు మున్నగునవన్నియు - సంస్కృతములోనే యుండుటచేతను, నిత్యకర్మలును. నిషేకాదిశ్మశానాంతకర్మలును, శ్రేతపౌరాణిక యజ్ఞములును, పారాయణగ్రంథములును, అన్నియు సంస్కృతములోనే యున్నందున హిందువులకిది శాశ్వతముగ సమాశ్రయణీయము. మహాత్మా గాంధి యిప్పట్ల నుడివిన యీ మాటలు గమనింపదగినవి.
 
“ప్రతి హిందూబాలుడును, బాలికయును సంస్కత భాషాజ్ఞానమును సంపాదింపవలయును. ప్రతి హిందువును అవసరము వచ్చినప్పుడు సంస్కృతములో మాట్లాడగల్గియుండవలయును.”(Mahatma Vol. II, p 361)
 
ఒకప్పడు క్రైస్తవమతమునకు పవిత్రభాషగా నుండి క్రైస్తవమతముతోబాటు శాశ్వతముగా జీవించీతీరునను అభిప్రాయమును గల్గించుచుండిన లాటిను భాష ఈనాడు క్రైస్తవమతమును వీడినట్లే సంస్కృతముకూడ హిందూమతమును వీడదాయను సందేహమెవరికైనను కలుగవచ్చును. ఆ సాదృశ్యము సరియైనదికాదు; (1) ఆదిలో లాటిను ద్వారా క్రైస్తవమతము యూరపులో వ్యాపించినను, తన్మత మూలగ్రంథము లాటిను పుట్టియుండలేదు. కావున లాటిను కును క్రైస్తవమునకును సంబంధము మూలమట్టమైనదికాదు. (2) హిందూమత మూలగ్రంథములలో అర్ధశక్తియేగాక అక్షరశక్తికూడ కలదు ఆ అక్షరములు అదేరీతిగా, అదేస్వరముతో ఉచ్చరింపబడుచో అపూర్వము పుట్టునని యీ మతములోని సిధ్ధాంతము. కావున మూల గ్రంథమునకు ప్రముఖస్ధానము ఎప్పుడును పోదు. (3) ఈ మతమునకు చెందిన ఉద్గ్రంథములలో - ముఖ్యముగ త్రిమతస్ధుల ప్రస్థానత్రయ భాష్యములలో శబ్దవిచారమే ముఖ్యముగా చేయబడినది. “ఇచ్చట ఏవకారమునకు ప్రయోజన మేమి?”,”అక్కడ ఆధాతువునకు ఆప్రత్యయము వచ్చినందున ఆయర్ధము తెలుపబడుచున్నది”--ఇత్యాదితెలుపబడుచున్నది”—ఇత్యాది ధోరణిలో భాషమీదనే విశేషముగ విచారణ జరిగియున్నందున, ఈ మతముతో సంస్కృత భాషకుగల సంబంధ మెన్నటికిని పోదు. (4) ఇంతవరకు భారతీయ భాషలలో రామాయణ భారత భాగవతములకు అసంఖ్యాక పరివర్తన గ్రంథములు బయలుదేరినను ఏ యొక ధార్మికవిషయమునగాని భక్తివిషయమునకాని తత్వవిషయమున కాని సందేహము వచ్చినను మూల సంస్కృతగ్రంథమును చూచియే సందేహమును తీర్చుకొనుచున్నారుకాని యీ ప్రాంతీయభాషాగ్రంథములను చూచి సందేహమునెవ్వరును తీర్చుకొనుటలేదు. కావున ప్రామాణికత మూలసంస్కృత గ్రంథములకు పోయే అవకాశము లేదు. (5) సంస్కృతమువంటి అమూల్యరత్న నిధానమును హిందువులు విడిచిపెట్టుకొందురనుటకంటె వీరికిచేయబడు అన్యాయము వేరొండు లేదు.
 
====భారతీయ భాషలకు ప్రాణము====
పంక్తి 187:
;Grammars
* [http://warnemyr.com/skrgram/ An Analytical Cross Referenced Sanskrit Grammar] By Lennart Warnemyr.
 
 
{{భారతీయ భాషలు}}
"https://te.wikipedia.org/wiki/సంస్కృతం" నుండి వెలికితీశారు