వేదాంతం రాఘవయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 8:
వీరికి తమ ఇంటివిద్యపై మక్కువ వలన చిన్నతనంలోనే తన తండ్రిగారి వద్ద ఈ నాట్యవిద్యకు శ్రీకారం చుట్టారు. తరువాత పద్మభూషణ్ [[వెంపటి చినసత్యం]] గారివద్ద తన విద్యకు మెరుగులు దిద్దుకున్నారు. పాఠశాల విద్యానంతరము ఉన్నత విద్యలకై [[హైదరాబాదు]] వెళ్లి అక్కడ మేనమామగారైన నాట్యకళాధర [[పసుమర్తి రామలింగశాస్త్రి]] గారివద్ద ఉంటూ ఈ నాట్యకళల మెళకువలను, తాళప్రకరణము , నట్టువాంగమును అభ్యసించడమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా [[కూచిపూడి నాట్యం]]లో బి.ఎ. మరియు ఎం.ఎ. డిగ్రీలను పొందారు.
 
రాఘవయ్య నృత్యదర్శకునిగా సినీజీవితాన్ని ప్రారంభించాడు. ''[[రైతుబిడ్డ]]'', ''[[విప్రనారాయణ]]'', ''[[స్వర్గసీమ]]'' మరియు ''[[వందేమాతరం]]'' సినిమాలకు నృత్యాలను సమకూర్చాడు. ఈయనకు ఆరుగురు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు. ఈయన భార్య [[సూర్యప్రభ (నటి)|సూర్యప్రభ]] ప్రముఖ నటి [[పుష్పవల్లి]] సోదరి. సూర్యప్రభ కూడా నటే.
 
==పని చేసిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/వేదాంతం_రాఘవయ్య" నుండి వెలికితీశారు