బంగాళాఖాతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: ఒరిస్సా → ఒడిషా using AWB
పంక్తి 5:
[[హిందూ మహా సముద్రం|హిందూ మహా సముద్రపు]] ఈశాన్య ప్రాంతపు [[సముద్రం|సముద్రాన్ని]] '''బంగాళాఖాతము''' (Bay of Bengal) అంటారు. త్రిభుజాకారంలొ ఉండే బంగాళాఖాతానికి తూర్పున [[మలై ద్వీపకల్పం]], పశ్చిమాన [[భారత ఉపఖండం]] ఉన్నాయి. అఖాతానికి ఉత్తరాగ్రాన [[భారత దేశము|భారతదేశపు]] రాష్ట్రమైన [[పశ్చిమ బెంగాల్]], మరియు [[బంగ్లాదేశ్]] దేశము ఉన్నాయి. అందువలననే దీనికి బంగాళాఖాతము అనే పేరు వచ్చింది. <br>దక్షిణాన [[శ్రీలంక]], [[అండమాన్ మరియు నికోబార్ దీవులు|అండమాన్‌ నికోబార్‌ దీవుల]] వరకు బంగాళాఖాతం వ్యాపించి ఉంది. విస్తీర్ణపరంగా బంగాళాఖాతం ప్రపంచంలో అతి పెద్దనైన ఖాతము (Bay).
 
భారత దేశం లోని చాలా ముఖ్యమైన నదులు పడమర నుండి తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి: <br>ఉత్తరాన, [[గంగా నది|గంగ]],[[మేఘనా నది|మేఘన]], [[బ్రహ్మపుత్రా నది|బ్రహ్మపుత్ర]] నదులు, దక్షిణాన [[మహానది|మహానది]], [[గోదావరి]], [[కృష్ణా నది|కృష్ణ]] మరియు [[కావేరీ నది|కావేరి]]నదులు. <br>గంగ, బ్రహ్మపుత్ర, మేఘన నదులు బంగాళాఖాతంలో కలిసే ప్రాంతంలో విస్తరించిన మడ అడవులను [[సుందర్బన్స్‌]] అంటారు.<br> [[మయన్మార్‌]] (బర్మా) లోని [[ఇరావతి నది|ఇరావతి]] కూడా బంగాళాఖాతంలోనే కలుస్తుంది.
 
[[చెన్నై]] (ఇదివరకటి మద్రాసు), [[విశాఖపట్నం]], [[కొల్కతా]] (ఇదివరకటి కలకత్తా), [[పరదీప్‌]] మరియు [[పాండిచ్చేరి]] బంగాళాఖాత తీరంలోని ముఖ్య నౌకాశ్రయాలు.
 
దీనిని భారతదేశానికి తూర్పున ఉండటం వల్ల చాలా కాలం వరకూ "తూర్పు సముద్రం" అనీ, లేదా దాని తత్సమ పేర్లతో పిలిచారు, ఇప్పటికీ మన చరిత్ర పుస్తకాలలోని ఇండియా మ్యాపులలో బ్రిటీషువారిముందు ఈ సముద్రాన్ని ఇదే పేరుతో సూచిస్తారు. ముఖ్యముగా గుప్తుల కాలం, విజయనగరకాలంనాటి మ్యాపులు చూడండి!
 
బ్రిటీషు వారు వచ్చినప్పుడు బెంగాలు చాలా పెద్దగా ఉండేది, దానిని[[ బెంగాలు ప్రావిన్సు]] అని పిలిచేవారు, ఇందులో ప్రస్తుత [[పశ్చిమ బెంగాల్]], [[బంగ్లాదేశ్]], ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని భాగాలు, [[ఒరిస్సాఒడిషా]] రాష్ట్రము, [[బీహార్‌]] రాష్ట్రము, [[జార్ఖండ్]] రాష్ట్రములు అంతర్భాగములుగా ఉండేవి, ఈ పెద్ద బెంగాలు ప్రావిన్సు [[బెంగాలు విభజన]] వరకూ కొనసాగింది, తరువాత ముక్కలైంది, ఇంత పెద్ద బెంగాలు ప్రావిన్సు ఉండుటం వల్ల, దానికి కోస్తాగా చాలావరకూ ఈ సముద్రం ఉండటం వల్ల ఈ సముద్రాన్ని వారు '''బే ఆఫ్ బెంగాల్''' అని పిలిచినారు, అదే స్థిరపడిపొయినది. తరువాత మన తెలుగులో అదే అనువాదం చెంది బంగాళాఖాతం అయినది.
 
ఇంకా చూడండి: [[అండమాన్ మరియు నికోబార్ దీవులు|అండమాన్‌ నికోబార్‌ దీవులు]]
==మూలాలు==
 
 
{{సముద్రాలు జాబితా}}
"https://te.wikipedia.org/wiki/బంగాళాఖాతం" నుండి వెలికితీశారు