బి.వి.రాజు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: ఒరిస్సా → ఒడిషా using AWB
పంక్తి 1:
[[File: భూపతిరాజు విస్సంరాజు.jpg|thumb| భూపతిరాజు విస్సంరాజు]]
 
సిమ్మెంటు పరిశ్రమ ప్రస్తావన రాగానే ఆయన గుర్తుకొస్తారు. సిమ్మెంట్ పరిశ్రమ వృద్ధికి ఆయనే పునాదిరాయి. ఆయనే పద్మభూషణ్ డాక్టర్ భూపతిరాజు విస్సంరాజు. విద్య, వైద్య తదితర సేవాకార్యక్రమాల్లో ఈయన పేరు మనకు వినబడుతూనే ఉంటుంది.
పంక్తి 5:
భూపతిరాజు విస్సంరాజు (బి.వి రాజు) 1920 లో అక్టోబరు 15 న [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[కుముదవల్లి]] గ్రామంలో చిన్న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. బెనారస్ హిందూ యూనివర్శిటీ నుండి కెమికల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. అమెకాలో హార్వర్డ్ యూనివర్శిటీ నుండి మేనేజ్ మెంట్ లో మాస్టర్ డిగ్రీ సాధించారు.
 
సిమ్మెంట్ పరిశ్రమలో ఆయన కెరీర్ అత్యంత దిగువ స్థాయిలో ప్రారంభమైంది. తరువాత అంచెలు అంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిమ్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా సేవలందించారు. దేశంలోని పలు ప్రాంతాలలో సిమ్మెంట్ ఫ్యాక్టరీల స్థాపనలో బి.వి రాజు కృషి ఎంతో ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్ లోని కడప, తాండూరు, అదిలాబాద్; హిమాచల్ ప్రదేశ్ లోని రాజ్ బన్, కర్నాటక లోని కురుకుంట, అస్సాంలోని బుకజమ్, మధ్యప్రదేశ్ లోని నీముఖ్, అఖిల్తాన్, మందర్ వంటి ప్రాంతాల్లో సిమ్మెంట్ ఫ్యాక్టరీలు నెలకొల్పబడటానికి బి.వి రాజు కారణం. తమిళనాడు, కేరళ, ఒరిస్సాఒడిషా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వాలకు సలహాదారుడిగా పనిచేశారు. దేశంలోని పారిశ్రామిక రంగంలొ చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం నుండి ఈయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ ఈయనను గౌరవ డాక్టరేట్ తో సన్మానించింది.
 
రిటైర్మెంటు అనంతరం పలు పరిశ్రమలను, సంస్థలను బి.వి రాజు స్థాపించారు. వాటిలో రాశి సిమెంట్, విష్ణు సిమెంట్, రాశి రిఫ్రాక్టరీస్, రాశి సిరామిక్స్, తెలంగాణా పేపర్ మిల్స్, రాశి సాఫ్టువేర్, రాశి ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్ వంటి సంస్థలు స్థాపించారు. నేడు బి.వి రాజు ఫౌండేషన్, శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆయన అశయాలకు మారు రూపాలుగా నిలిచాయి.
పంక్తి 12:
==మూలాలు==
http://www.seethapoly.edu.in/Founder%20Chairman.htm
 
[[వర్గం: సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం: పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:1920 జననాలు]]
[[వర్గం:పద్మభూషణ పురస్కార గ్రహీతలు]]
"https://te.wikipedia.org/wiki/బి.వి.రాజు" నుండి వెలికితీశారు