సరస్వతి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన (4) using AWB
చి →‎ఇంకా: clean up, replaced: ఒరిస్సా → ఒడిషా using AWB
పంక్తి 62:
హిందూమత ప్రభావం ఉన్న బౌద్ధమతంలో కొన్ని చోట్ల మంజుశ్రీ, మహా సరస్వతి, వజ్ర సరస్వతి, ఆర్య వజ్ర సరస్వతి, వజ్ర వీణా సరస్వతి, వజ్ర సారద వంటి పేర్లతో సరస్వతి ఆరాధన జరిగింది. జైనులు శృతదేవతగా, షోడశ విద్యా దేవతలకు అధికారిణిగా సరస్వతిని ఆరాధించారు. శ్వేతాంబరులు హంసవాహిని అని ఈ దేవిని స్తుతించారు. "శ్రీ మద్భోజ నరేంద్ర చంద్ర నగరీ విద్యాధరీ" అని భోజుడు వాగ్దేవిని ప్రతిష్టించాడని ప్రసిద్ధి ఉన్నది.
 
క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందిన సరస్వతీ విగ్రహము ఉత్తర ప్రదేశ్‌లో మధుర సమీపంలోని 'ఖజ్జాలీటీలా'లో లభించింది. గుప్తరాజులలో ఒకడైన సముద్ర గుప్తుడు తన సువర్ణ నాణెములపై ఒకవైపు సరస్వతీ దేవిని, మరొకవైపు వీణను ముద్రించాడు. అలాగే క్రీ.పూ. 550-575 ప్రాంతంలో ఒక గౌడ వంశ రాజుల తన నాణెములపై సరస్వతీ దేవి రూపమును ముద్రించాడు. క్రీ.శ. 10వ శతాబ్దంలో ఒరిస్సాఒడిషా (ఖచ్చింగ్)లో వీణాపాణియైన సరస్వతి విగ్రహం చెక్కబడింది. పాల వంశపు రాజుల నాటివని చెప్పబడుచున్న సరస్వతి విగ్రహాలు పాట్నాలోను, కలకత్తా (హాష్‌తోష్) మ్యూజియంలోను భద్రపరచబడ్డాయి. ఇంకా వివిధ మ్యూజియంలలో సరస్వతి శిల్పాలున్నాయి. ఖజురాహోలోని పార్శ్వనాధాలయంలోను, ఖందరీయ మహాదేవాలయంలోను వాగ్దేవి విగ్రహాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లోని ఘంటసాలలో క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందిన సరస్వతీ విగ్రహం లభించింది. క్రీ.శ. 10వ శతాబ్దికి చెందిన చాళుక్యుల కాలం నాటి విగ్రహం సామర్లకోట భీమేశ్వరాలయంలో ఉంది. కారెంపూడి, తంజావూరు, హలెబీడు, శ్రీరంగంలలో సరస్వతీ దేవి విగ్రహాలున్నాయి.
 
== పేర్లు ==
"https://te.wikipedia.org/wiki/సరస్వతి" నుండి వెలికితీశారు