కలం పేరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
* రచయితల ప్రాచుర్యం వల్ల కొత్తగా చేపట్టబోయే ప్రక్రియపై పూర్వరచనల ప్రభావాలు పడకుండా ఉండేందుకు. ఉదాహరణకు ముళ్ళపూడి వెంకటరమణ కథలు, సినీసమీక్షలు వంటి వాటిలో లబ్దప్రతిష్టుడయ్యాకా ''గిరీశం లెక్చర్లు'' అనే ప్రక్రియను ప్రారంభించేందుకు ఎస్. పార్థసారధి అనే పేరు ఎంచుకుని రాశారు. అప్పటికే స్వంత పేరుతో ప్రతిష్ట మూటకట్టుకుని ఉండడంతో దానికీ తన పేరే పెడితే లోటుపాట్లు తెలియవని, అదే పేరుతో రాస్తే అలవాటుగా మెచ్చేసుకునే అవకాశం ఉంది, వేరే పేరుతో రాసినా మెచ్చుకుంటేనే నిఖార్సైన మంచి రచన అంటూ పాఠకులు అనుమానించడానికి కూడా వీల్లేకుండా వేరే వ్యక్తి పేరే అనిపించేలా ఇంటిపేరుతో కలిపి ఎస్. పార్థసారధి అని కలంపేరు పెట్టుకున్నారు.<ref name="డైవర్సిటీ.. దై నేమ్ ఈజ్ రమణా">ముళ్లపూడి వెంకటరమణ సాహితీ సర్వస్వం-5 కదంబరమణీయం-2 సంపుటికి ''డైవర్సిటీ.. దై నేమ్ ఈజ్ రమణా!'' పేరిట ఎం.బి.ఎస్.ప్రసాద్ ముందుమాట</ref>
* స్త్రీల గురించి, స్త్రీలు మాట్లాడుతున్నట్లుగా వ్రాసిన వ్యాసాలకు పురుషులు స్త్రీల పేర్లు పెట్టుకోవడం. ఉదాహరణకు ఇల్లాలి ముచ్చట్లు అంటూ స్త్రీలు మాటల్లోనే చమత్కారంగా విసుర్లు విసురుతూ సాగే కాలమ్ పురాణం సుబ్రహ్మణ్యశర్మ వ్రాసినా పురాణం సీత అనే కలంపేరుతోనే రచన చేశారు. ఆ రచనల్లో పలుమార్లు సుబ్రహ్మణ్యశర్మ భార్య ప్రస్తావిస్తున్నట్టే ''మావారు ముఫ్ఫయ్యేళ్ల క్రిందట డిల్లీలో రైల్వే ఉద్యోగం చేసేవారు'' అంటూ వ్రాశారు.<ref>ఇల్లాలి ముచ్చట్లు:పురాణం సీత(సుబ్రహ్మణ్యశర్మ):నవోదయ ప్రచురణలు</ref> ముళ్లపూడి వెంకటరమణ పలు వ్యాసాలు సి.వి.విజయలక్ష్మి, సి.వి.వి.లక్ష్మి వంటి మారుపేర్లను వాడి ఒక ఆలోచనాపరురాలైన యువతి రాసినట్టుగా రాశారు.<ref name="డైవర్సిటీ.. దై నేమ్ ఈజ్ రమణా" />
* భారత స్వాతంత్ర్య పూర్వం బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం ఏర్పరిచిన నియమం ప్రకారం ప్రభుత్వ సేవకులు ఎవరూ సాంస్కృతిక కార్యకలాపాల్లో పాల్గొనరాదు. పాల్గొంటే ముందస్తుగా అనుమతి స్వీకరించి, ఒకవేళ సాంస్కృతిక కార్యక్రమాల వల్ల డబ్బు వస్తే అందులో మూడోవంతు ప్రభుత్వానికి ఇవ్వాల్సివుంటుంది. ఈ నియమాన్ని భారతదేశానికి స్వాతంత్రం వచ్చాకా కూడా 1963 వరకూ మార్పలేక కొనసాగింది. 1963 నాటికి ఈ నియమంలోని అసంబద్ధత అవగాహన చేసుకున్న ప్రభుత్వం మార్చింది. అంతవరకూ ప్రభుత్వోద్యోగాలు చేస్తున్న రచయితలు మారుపేర్లతో రచనలు చేయాల్సివచ్చింది. ఉదాహరణకు ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత [[భమిడిపాటి రామగోపాలం]] 1951లో ప్రభుత్వోద్యోగంలో చేరేవరకూ తన పేరుమీదే రచనలు చేశారు. 1951లో ప్రభుత్వోద్యోగంలో చేరాకా తన పేరును దాచిపెట్టి ''వాహిని'' అనే మారుపేరుతో రచనలు చేశారు. చివరకు 1963 ఏప్రిల్‌లో నియమాన్ని ప్రభుత్వం సవరించి, ఆంక్షలు తొలగించడంతో తిరిగి భరాగోగా రచనలు చేయడం ప్రారంభించారు.<ref name="అత్తలూరి నరసింహారావు పదినిమిషాల్లో భరాగో">{{cite book|last1=అత్తలూరి|first1=నరసింహారావు|title=ఇట్లు మీ విధేయుడు (పదినిమిషాల్లో భరాగో పరిచయము వ్యాసం)|date=మార్చ్march 1990|publisher=విశాఖ సాహితి|location=విశాఖపట్టణం|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Etlu%20Mee%20Vidheyudu%20Bhamidipati%20Rama%20Gopalam%20Samagra%20Katha%20Sankalanam&author1=B.Rama%20Gopalam&subject1=-&year=1990%20&language1=telugu&pages=666&barcode=2020120034473&author2=&identifier1=&publisher1=VISHAKA%20SAHITHI&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP%20HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORAMTICS,%20HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data/upload/0034/478|accessdate=10 March 2015}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కలం_పేరు" నుండి వెలికితీశారు