ఒంటిమిట్ట: కూర్పుల మధ్య తేడాలు

కోదండ రామాలయం, ఒంటిమిట్ట link
పంక్తి 15:
ఒక మిట్ట పైన ఈ రామాలయం నిర్మించబడింది. అందుకని ఒంటిమిట్ట అని ఈ రామాలయానికి, గ్రామానికి పేరు వచ్చింది. ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఇక్కడ రాముణ్ణి కొలిచి తమ వృత్తిని మానుకుని నిజాయితీ గా బ్రతికారని, వారి పేరు మీదుగానే ఒంటిమిట్ట అని పేరు వచ్చిందని ఇంకొక కథనం కూడ ఉంది.<ref name="eenadu">ఏప్రిల్ 5, 2009 ఈనాడు ఆదివారం సంచిక ఆధారంగా</ref>మిట్టను సంస్కృతంలో శైలమంటారు. [[మహాభాగవతం|ఆంధ్ర మహాభాగవతాన్ని]] రచించిన [[పోతన]] తాను ఏకశైలపురి వాసినని చెప్పుకున్నాడు. అంతే గాక తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం గావించాడు. దాన్ని బట్టి, భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు. ఈ ఆలయంలో సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు. కాబట్టి ఏకశిలానగరమనీ పేరు వచ్చింది. హనుమంతుడు లేని రామాలయం భారత దేశంలో ఇదొక్కటే.<br />
ఈ గ్రామాన్ని గురించి తొలి తెలుగు యాత్రాచరిత్రయైన [[కాశీయాత్ర చరిత్ర]]లో ప్రస్తావనలున్నాయి. ఆ గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రలో భాగంగా మజిలీలైన [[అత్తిరాల]] నుంచి [[భాకరాపేట]] వెళ్ళే మార్గమధ్యలో ఒంటిమిట్టను దాటి వెళ్ళారు. దీనివల్ల 1830 నాడు గ్రామ స్థితిగతులు తెలియవస్తున్నవి. అప్పటికి గ్రామంలో నాల్గుపక్కల కొండలే కలిగిన భారీ చెరువున్నది. చెరువు కట్టమీద ఉన్న బాటపైనే వారి ప్రయాణం సాగింది. ఆ ఒంటిమిట్టలో చూడచక్కనైన గుళ్ళు ఉన్నాయన్నారు. గ్రామంలో ఓ ముసాఫరుఖానా(యాత్రికుల నిలయం) ఉండేదని, అప్పటికే అది బస్తీ గ్రామమని పేర్కొన్నారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>
== గ్రామం పేరు వెనుక చరిత్ర ==
ఒంటిమిట్ట పేరులో ఒంటి పూర్వపదం, మిట్ట ఉత్తరపదం. వీటిలో మిట్ట అనే ఉత్తరపదానికి ఎత్తైన భూప్రదేశాన్ని సూచించే జనావాసం అన్న అర్థం ద్యోతకమౌతోంది.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Neloore%20Jilla%20Grama%20Namalu%20Bhasha%20Samajika%20Parishilana&author1=Ugranam%20Chandhrashekar%20Reddy&subject1=&year=1989%20&language1=telugu&pages=284&barcode=2020120035071&author2=&identifier1=&publisher1=SRI%20VENKATESHWARA%20VISWA%20VIDYALAYAM&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0035/076|accessdate=10 March 2015}}</ref>
 
==స్థల పురాణం==
"https://te.wikipedia.org/wiki/ఒంటిమిట్ట" నుండి వెలికితీశారు