త్రిపుర సుందరి: కూర్పుల మధ్య తేడాలు

వ్యుత్పత్తి
పంక్తి 3:
 
==వ్యుత్పత్తి==
'''త్రిపుర ''' అనగా ముల్లోకములు. '''సుందరి ''' అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం.
 
అయితే '''త్రిపుర ''' అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చినదని సిద్ధాంతము కలదు. భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో
 
: ఈ దేవత మూడు రూపాలలో ఉంటుంది.
: * '''స్థూల (భౌతికం):''' ధ్యాన శ్లోకాలలో వివరించబడినది. బహిర్యాగంతో పూజించబడుతుంది.
: * '''సూక్ష్మ (సున్నితం): ''' మూల మంత్రాలలో వివరించబడినది. జపంతో పూజించబడుతుంది.
: * '''పర (మహోన్నతం): ''' అంతర్యాగం (యంత్ర-మంత్ర ప్రయోగాలతో) పూజించబడుతుంది.
 
: [[శ్రీ చక్రం]] లో బిందువు ఒకటిగానే కనిపించిననూ శాంతమయి అయిన ఆ దేవి మూడు వివిధ శక్తుల సమాహారము.
: * '''ఇఛ్ఛా శక్తి:''' వామాదేవి, [[బ్రహ్మ]] యొక్క దేవేరి
: * '''జ్ఞాన శక్తి:''' జ్యేష్ఠాదేవి, [[విష్ణువు]] యొక్క దేవేరి
: * '''క్రియా శక్తి:''' రౌద్రి, [[శివుడు]] యొక్క దేవేరి
: ఇవన్నీ సాక్ష్యాత్ [[అంబికా దేవి]] యొక్క రూపాంతరాలే
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/త్రిపుర_సుందరి" నుండి వెలికితీశారు