బంగారుపాప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
 
==కథాసంగ్రహం==
కోటయ్య అమాయకుడు. కోటయ్య గోపాలస్వామిని గురువులా పూజించాడు. రామి తన వలపులరాణి అనుకున్నాడు. రామితో తన పెళ్లికి అంతా నిశ్చయమైపోయింది. కాని రహస్యంగా రామికీ, గోపాలస్వామికీ స్నేహం కుదిరిందని అతనికి తెలియదు. గోపాలస్వామి, రామి కలిసి తాము చేసిన దొంగతనాన్ని అతనికి అంటగట్టి అతన్ని జైలుకు పంపారు. భయంకరమైన పగ అతడి మనస్సును ఆవహించింది. మానవత్వంలో నమ్మకం పోయి అతను పశువుగా మారిపోయాడు. కొలిమి వదలని కోటయ్యకు కల్లుపాక, జూదపుశాల ఆవాసాలయ్యాయి. రామిని, గోపాలస్వామిని అంతమొందించడం అతని జీవిత ధ్యేయంగా మారింది.
 
సుందర్రామయ్య ఆ గ్రామంలోకల్లా పెద్ద గృహస్థుడు. కొడుకు మనోహర్‌కి ఒక సంబంధం స్థిరపరిచాడు. అప్పుడు మనోహర్ ఊళ్ళో లేడు. అయినా తను మాటిచ్చిన తరువాత కొడుకు కాదనలేడనే ధైర్యం సుందర్రామయ్యది. కాని తండ్రికి తెలియకుండా మనోహర్ శాంత అనే అమ్మాయిని పెళ్లాడి బెంగుళూరులో కాపురం పెట్టాడు. వాళ్లకొక ఆడపిల్ల కూడా పుట్టింది.
 
==పాటలు==
# యవ్వన మధువనిలో వన్నెల పూవుల ఉయ్యాలా - (రచన: [[దేవులపల్లి కృష్ణ శాస్త్రి]]; గానం: పి.సుశీల, ఎ.ఎమ్. రాజా)
"https://te.wikipedia.org/wiki/బంగారుపాప" నుండి వెలికితీశారు