బంగారుపాప: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
అప్పుడు నిజం బయటపడినా చచ్చిపోయిన శాంత తిరిగిరాదు. తన చేయిదాటిన కథను త్రవ్వినట్టయితే తనకే గాక అందరికీ బాధ. అంచేత అగ్నిపర్వతం లోపల దహిస్తున్నా, తండ్రిమాటకు తలొగ్గి పార్వతిని పెళ్లి చేసుకున్నాడు మనోహర్.
 
పగతో రగిలే కోటయ్య హృదయాన్ని పాప పండువెన్నెలతో నింపింది. పాప సాన్నిహిత్యం కోటయ్యలోని ప్రతి అణువుని మానవత్వంతో నింపి వేసింది. గర్భశత్రువైన గోపాలస్వామి చేజిక్కితే అతన్ని చంపడానికి బదులు, అతిథిగా గౌరవించాడు.
 
పార్వతికి పిల్లలు కలుగరు. ఆమె మేనల్లుడు శేఖర్ సుందర్రామయ్య ఇంట్లోనే పెరుగుతున్నాడు. వంశమర్యాదలకీ, సంప్రదాయాలకీ బందీ అయిన మనోహర్, నిజం వెల్లడించలేకపోయినా అతని పితృహృదయం పాపకోసం పరితపించేది. ఏదీ మిషతో కోటయ్యకు అతడు డబ్బిస్తుండేవాడు. పాపకూ, శేఖర్‌కూ స్నేహం కుదిరి అది ప్రేమగా మారింది. ఈ విషయం సుందర్రామయ్యకు తెలుస్తుంది. సుందర్రామయ్య కోటయ్య ఇంటికి వచ్చి పాపా శేఖరం కలిసి తిరగడం మంచిదికాదని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ సంగతి తను స్వయంగా పాపకు చెప్పలేక చెల్లెలు మంగమ్మ చేత చెప్పిస్తాడు కోటయ్య.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/బంగారుపాప" నుండి వెలికితీశారు