వెండి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
==రసాయనిక లక్షణాలు==
వెండి రసాయనికంగా చురుకైన లోహం కాదు . ఇది గాలిలోని ఆమ్లజనితో చర్య నొందదు . చాలా నెమ్మదిగా గాలి సమక్షములో గంధకంతో చర్య వలన నల్లని సిల్వరు సల్ఫైడు (AgS) అనే సమ్మేళనం ఏర్పడును. నీరు, ఆమ్లాలతో, మరియు పలుసమ్మేళనాలతో వెండి క్రియా/చర్యారహితంగా ఉంటుంది. [[నత్రజని]], [[ఉదజని]] తోకూడా చర్యారహితంగా ఉండును. మరియు దహింప బడదు.వెండి నత్రికామ్లం మరియు వేడి గాఢ సల్ప్యూరిక్ ఆమ్లం త్వరగా కరుగుతుంది. వెండి ద్రవస్థితి లో తనభారానికి 22 రెట్లు భారమున్న ఆక్సిజన్ ను తనలో కరగించు కుంటుంది. ఘనీభవించునప్పుడు గ్రహించిన ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. అలాగే ఆక్షీకరణ చేయు ఆమ్లాలలో కుడా కరుగుతుంది .అలాగే సైనైడ్ కలిగిన ద్రవాలలో కుడా వెండి కరుగుతుంది .సైనైడులో వెండిని కరగించి నప్పుడు డైసైనో అర్జెన్ టేట్[Ag(CN)2]−, అనే అయానులు ఏర్పడును.
 
వెండి ఒజోను, హైడ్రోజను సల్పైడు మరియు సల్ఫరుకలిగిన గాలితో ఎక్కువ సేపు సంపర్కంలో ఉండిన మెరుపు కోల్పోవును.
 
==వనరులు-లభ్యత ==
"https://te.wikipedia.org/wiki/వెండి" నుండి వెలికితీశారు