చిలుకూరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{బొమ్మ అభ్యర్థన}}
'''చిలుకూరి నారాయణరావు''' ([[1889]] - [[1951]]) భాషావేత్త, చరిత్రకారుడు మరియు సంస్కృతాంధ్ర పండితుడు. ఈయన [[విశాఖపట్నం జిల్లా]], [[పొందూరు]] సమీపంలోని [[ఆనందపురం]] లో 1889 ఆగస్టునెల తొమ్మిదో తేదీన జన్మించాడు. తండ్రి భీమాచారి. తల్లి లక్ష్మమ్మ. మాతృభాష [[కన్నడం]]. ఈయన శ్రీకాకుళం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, [[పర్లాకిమిడి]] మరియు [[విజయనగరం]] ల లోని [[మహారాజా కళాశాల]] లో చదివి పట్టభద్రులయ్యాడు. [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి తెలుగు మరియు కన్నడం భాషలలో ఎం.ఏ. పట్టా పొందాడు. పదకొండవ శతాబ్దం నాటి ఆంధ్ర భాష గురించి పరిశోధన చేసి [[డాక్టరేట్]] పట్టా పొందాడు. ఉత్తర సర్కారు జిల్లాలలో ఇంగ్లీషు బోధన విధానం ప్రచారం చేయటానికి [[జె.ఎ.యేట్స్]] తో కలిసి కొంతకాలం పాఠశాల పరీక్షకుడుగా పనిచేశాడు.తరువాత అనంతపురం దత్తమండల కళాశాల(తరువాత కాలంలో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ)లో ఆంద్రోపన్యాసకుడిగా చాలాకాలం పనిచేశాడు. ఈయన [[ఆంధ్ర విశ్వకళా పరిషత్తు]] చే '[[కళాప్రపూర్ణ]]' బిరుదును, కాశీ సంస్కృత విద్యాపీఠంచే 'మహోపాధ్యాయ' బిరుదును పొందాడు. 'ఆంధ్ర బెర్నార్డ్ షా' అనే బిరుదుకూడ ఇతనికి వున్నది. ఇతడు 1951 జూన్‌ నెల 22న [[పుట్ట కురుపు]] వ్యాధి వలన [[చెన్నై]] లో పరమపదించాడు.