వేరుశనగ నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
===వేరుశనగ గింజల నుండి నూనెను తీయ్యడం===
 
వేరుశనగ గింజలనుండి పూర్వకాలంలో [[గానుగ]], రోటరిలద్వారా నూనెను తీసెవారు. ప్రస్తుతము 'ఎక్స్‌పెల్లరు '(Expeller)<ref>{{citeweb|url= http://www.oilgae.com/ref/glos/expeller_press.html|title=Expeller Press|publisher=oilgae.com|date=|accessdate=2015-03-15}}</ref> అనే యంత్రాలద్వారా తీయుచున్నారు. ఎక్స్‌పెల్లరులో హరిజంటల్ గా బారెల్‌ వుండును. బారెల్‌ చుట్టు స్టీల్‌ బద్దీలు బిగించబడి వుండును. బద్దీలమధ్య చిన్నఖాళివుండును. బారెల్‌ మధ్యగా మరలున్న (worms) ఒకవర్ము షాప్టువుండును. నూనెగింజలను ఎక్స్‌పెల్లర్‌ యొక్క ఫీడ్‌ హపరులో వేసితిప్పినప్పుడు , వర్మ్‌షాప్ట్‌ మరల ప్రెసరువలన నూనెగింజలు నలగగొట్టబడి, బారెల్‌ బద్దీలసందుల గుండా నూనె బయటకు వచ్చి, దిగువన వున్న ట్రేలో కలెక్ట్ అగును. నూనెతీయబడిన నూనెగింజలు కేకు రూపములో ఎక్స్‌పెల్లరు కోన్‌ ద్వారా బయటకు వచ్చును. ఎక్స్‌పెల్లరునుండి వచ్చిన నూనెలో కొన్నిమలినాలు వుండును. అందుచే నూనెను ఫిల్టరు ప్రెస్‌లో ఫిల్టరు చెయ్యుదురు. వేరుశెనగ కాయల పొట్టును (shell) తొలగించి, గింజల (Kernel) నుండి నూనెను సంగ్రహించెదరు. వేరుశెనగ కాయ యొక్క పైపొట్టును తొలగించు యంత్రమును డికార్డికెటరు (Decorticator) అందురు.ఎక్సుపెల్లరులద్వారా తీసిన నూనెను ఫిల్టరుచేసినతరువాత నేరుగా వంటనూనెగా వినియోగిస్తారు.గింజలలో నూనె తీయగా మిలిన గింజలపదార్థాన్ని శెనగచెక్క లెదా పిండి(oil cake)అంటారు.ఇందులో నూనెతీయుటకు ఉపయోగించిన ఎక్సుపెల్లరు సామర్థ్యంను బట్టి 6-8% నూనె మిగిలి వుంటుంది.పిండిలోని ఈ నూనెను సాల్వెంట్ ఎక్సుట్రాక్షన్ ప్లాంట్‌లో ఆడించడం ద్వారా పొందవచ్చును.సాల్వెంట్ ఎక్సుట్రాక్షను విధానంలో పిండిలో 1.0%కన్న తక్కుగా నూనె పిండి/చెక్కలో మిగిలి పోతుంది.సాల్వెంట్ ప్లాంట్ ద్వారా తీసిన నూనెను నేరుగా వంటనూనెగా వాడుటకు పనికిరాదు.ఈ నూనెలో కరిగిన ,కరుగని మలినాలు(impurities)1.0-1.2% వరకుండును.మరియు ఫ్రీఫ్యాటి ఆమ్లాలు 3-5% వరకుండును.వంటనూనెగా వినియోగించు ఏనూనెలోనైన ఈ స్వేచ్ఛా కొవ్వుఆమ్లాలు(free fatty acids)0.2% కన్న ఎక్కువ వుండరాదు.అందుచే సాల్వెంట్ ప్లాంట్ ద్వారా తీసిన నూనెను తప్పనిసరిగా శుద్ధీకరించిన(refining) తరువాత మాత్రమే వంటనూనెగా వాడెదరు.
 
===నూనె యొక్క లక్షణాలు-భౌతిక ధర్మాలు===
"https://te.wikipedia.org/wiki/వేరుశనగ_నూనె" నుండి వెలికితీశారు