అపవాదు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి సవరణ, replaced: → (4) using AWB
పంక్తి 12:
[[దస్త్రం:Apavadu 1941 advertisement 3.jpg|thumbnail|ఎడమ|120px|అపవాదు చిత్రపు విడుదల ప్రకటన]]
'''అపవాదు''' [[గూడవల్లి రామబ్రహ్మం]] దర్శకత్వం వహించిన 1941 తెలుగు చలనచిత్రం. ప్రముఖ [[తెలుగు సినిమా]] నిర్మాత, దర్శకుడు [[కోవెలమూడి సూర్యప్రకాశరావు]] (కె.ఎస్.ప్రకాశరావు) యొక్క తొలి విడుదలైన చిత్రము. ప్రకాశరావు తొలి పాత్ర 1940లో నిర్మించబడిన [[గూడవల్లి రామబ్రహ్మం]] సినిమా [[పత్ని]]లో నటించినా అది 1942 వరకు విడుదల కాలేదు.
 
==కథ==
రెవిన్యూ ఇన్‌స్పెక్టరుగా పనిచేస్తున్న ప్రకాశ్ తన భార్య కమల, చెల్లెలు కాంతం మరియు కొడుకు కిట్టూతో కలిసి ఆనందంగా జీవనం సాగిస్తుంటాడు. వెంకయ్య మరియు ఆయన భార్య అనసూయ వీరి పొరుగువారు. అనసూయ ప్రకాశ్ స్నేహితుడైన కామరాజును మోహిస్తుంది. కానీ కామరాజు ఆమెను తిరస్కరిస్తాడు. అనసూయ స్థానిక రౌడీ అయిన మంగపతిని ఉపయోగించుకొని కామరాజుపై ప్రతీకారం తీర్చుకోవటానికి కుట్రపన్నుతుంది. ఈ కుట్రలో భాగంగా కమలకు కామరాజుకు అక్రమ సంబంధముందన్న పుకార్లు పుట్టిస్తారు. పర్యవసానంగా కమల ఆత్మహత్యాప్రయత్నం చేస్తుంది. కామరాజు రత్నం సహాయంతో తను కమలకు వ్రాసానని చెప్పబడుతున్న ఉత్తరంలోని దస్తూరీ, అనసూయ దస్తూరీ ఒకే విధంగా ఉన్న విషయాన్ని కనుగొంటాడు. చివరికి నిజం బయటికొస్తుంది. కమలా, ప్రకాశ్ ఎప్పటిలాగే తిరిగి ఆనందంగా జీవిస్తారు.
 
==పాత్రధారులు==
[[దస్త్రం:Aveti Purnima in Apavaadu 1941 movie still.jpg|thumb|ఎడమ]]
Line 30 ⟶ 28:
* శేషగిరి - మంగపతి
* మాస్టర్ ప్రభాకర్ - కిట్టూ, ప్రకాశ్ కొడుకు
 
==పాటలు==
ఈ సినిమాలో మొత్తం 15 పాటలున్నాయి. వాటిని[[బసవరాజు అప్పారావు]], [[తాపీ ధర్మారావు]] మరియు [[కొసరాజు రాఘవయ్య]] వ్రాశారు.<ref>[http://ghantasalagalamrutamu.blogspot.com/2011/01/1941_18.html Lyrical details of Apavadu film at Ghantasala Galamrutamu.]</ref>
Line 48 ⟶ 45:
# లోకమదేపని కోడై కూయగా పలుకక ఉందువు - రచన: తాపీ ధర్మారావు
# వీణె చేజారి పడిపోవు వ్రేళ్ళు శ్రుతుల నింపుగా - రచన: బసవరాజు అప్పారావు
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/అపవాదు" నుండి వెలికితీశారు