ఏకవీర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ, replaced: → (10) using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
 
{{సినిమా|
name = ఏకవీర |
Line 18 ⟶ 17:
imdb_id = 0261677|
}}
తొలి తెలుగు [[జ్ఞానపీఠ అవార్డు|జ్ఞానపీఠ]] బహుమతి గ్రహీత, కవిసమ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] రాసిన '''ఏకవీర''' నవల ఈ సినిమాకు ఆధారం. ఈ సినిమాకు మాటలు రాసింది మరో జ్ఞానపీఠ గ్రహీత [[సి.నారాయణరెడ్డి]]. నారాయణరెడ్డి తన సినీరచనా జీవితంలో సంభాషణలు రాసిన సినిమాలలో ఇది మొదటిది కాగా, రెండవది [[అక్బర్ సలీం అనార్కలి]]. విశ్వనాథ సత్యనారాయణకు చిత్ర రూపం సంతృప్తి కలిగించలేదు. తొలిసారి విడుదలైనప్పుడు వ్యాపారపరంగా చిత్రం విజయవంతం కాలేదు కానీ, తరువాత విడుదలల్లో తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించారు. కె.వి.మహదేవన్ సంగీతం, దేవులపల్లి, నారాయణ రెడ్డిల సాహిత్యం చిత్రాన్ని అజరామరం చేసాయి.
== శీర్షిక ==
సినిమాకు మూలమైన విశ్వనాథ సత్యనారాయణ నవల [[ఏకవీర]] అన్న పేరే నిర్ధారించారు. ఏకవీర అన్న పేరును విశ్వనాథ సత్యనారాయణ ఎందుకు పెట్టారన్న విషయాన్ని సాహిత్య విమర్శకులు పరిశీలించారు. నవలలో ప్రధానమైన పాత్రలు ఏకవీర, మీనాక్షి, కుట్టాన్, వీరభూపతి. వీరిలో ప్రతిపాత్ర విశిష్టమైనవే, ఏ పాత్ర లేకున్నా కథాగమనం మారిపోతుంది. కానీ మీనాక్షి అనో, వీరభూపతి అనో, కుట్టాన్ అనో మరేదో పేరో కాకుండా ఏకవీర అనే పేరు పెట్టడం వెనుక విమర్శకులు కారణాన్ని విశ్లేషించారు. నవల ముగుస్తున్నప్పుడు సుందరేశ్వరుడు ఏకవీరను ఆవహించి ఆమెతో ఒక మహత్కార్యం చేయించాడని, అందుకే వారి కన్నా ఆ పాత్ర కొంత మిన్నయైనదని భావించారు.<ref name="టే.కామేశ్వరరావు విమర్శ">{{cite journal|last1=కామేశ్వరరావు|first1=టే|title=ఏకవీర విమర్శ|journal=గృహలక్ష్మి|date=మార్చి 1934|volume=7|url=https://te.wikisource.org/wiki/%E0%B0%97%E0%B1%83%E0%B0%B9%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF_%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8%E0%B0%AA%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95/%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B0%AE%E0%B1%81_7|accessdate=6 March 2015}}</ref>
 
== చిత్రకథ==
[[తమిళనాడు]]లోని మదురై నేపధ్యంగా కథ సాగుతుంది. వైగై నది కూడా కథలో ఒక పాత్రగా ఉంటుంది. కుట్టాన్ సేతుపతి (ఎన్.టి.ఆర్), వీరభూపతి (కాంతారావు) ప్రాణస్నేహితులు. పరిస్థితుల కారణంగా సేతుపతి ఏకవీర (కె.ఆర్.విజయ) ను, వీరభూపతి మీనాక్షి (జమున) ను పెళ్ళి చేసుకుంటారు. నిజానికి సేతుపతి మీనాక్షిని, వీరభూపతి ఏకవీరను ప్రేమించి ఉంటారు. ఈ నలుగురి మధ్య అంతరంగ సంఘర్షణ చిత్రంలో ఆవిష్కరింపబడింది.
 
{{clear}}
 
===పాత్రలు-పాత్రధారులు===
{| class="wikitable"
Line 58 ⟶ 54:
| [[రాజసులోచన]] || నర్తకి
|}
 
== పాటలు==
{| border="2" cellpadding="4" cellspacing="0" style="margin: 1em 1em 1em 0; background: #f9f9f9; border: 1px #aaa solid; border-collapse: collapse; font-size: 95%;"
Line 84 ⟶ 79:
| ''కనుదమ్ములను మూసి, కలగంటి నొకనాడు'' ||సి.నారాయణరెడ్డి ||
|}
 
==సన్నివేశాలు==
[[ఫైలు:TeluguFilm Ekaveera2.jpg|left|thumb|350px|ఏకవీర - సినిమా సన్నివేశాలు]]
 
{{clear}}
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
* సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
* డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
 
==బయటి లింకులు==
*[http://www.imdb.com/title/tt0261677/ ఐ.ఎమ్.డి.బి. లో ఏకవీర సినిమా]
*[http://www.youtube.com/watch?v=S1kMW0w5SSY యూ ట్యూబ్ లో ఏకవీర పూర్తి సినిమా]
 
 
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/ఏకవీర_(సినిమా)" నుండి వెలికితీశారు