"మద్దుకూరి చంద్రశేఖరరావు" కూర్పుల మధ్య తేడాలు

==జీవిత విశేషాలు==
ఇతడు [[కృష్ణాజిల్లా]], [[పెదపారుపూడి]] మండలం, [[వెంట్రప్రగడ]] గ్రామంలో [[1907]]లో జన్మించాడు. ఇతడు విద్యార్థి దశలో జాతీయోద్యమంలో పాల్గొని దాని నుంచి కమ్యూనిస్టు ఉద్యమానికి వచ్చాడు. ఇతడు ఇంజినీరింగ్‌ విద్యార్థిగా [[1930]]లో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లాడు. [[1932]]లో వ్యష్ఠి సత్యాగ్రహంలో పాల్గొన్న సందర్భంలో పోలీసులు ఇతడిని చిత్రహింసలు పెట్టారు. రెండేళ్ల కఠిన జైలు శిక్ష విధించారు. జైలులోనే మార్క్సిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేసి అవగాహన చేసుకున్నాడు. తన పంథా నిర్ధారించుకున్నాడు. తనతోపాటు అనేక మంది యువకులను సమీకరించి పార్టీకి సుశిక్షితులైన సైనికుల్లా మార్చాడు. [[పుచ్చలపల్లి సుందరయ్య]], కంభంపాటి సత్యనారాయణ, చలసాని వాసుదేవరావుతో కలిసి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి తనదైన ముద్రతో పనిచేశాడు. క్షేత్రస్థాయిలో పనిచేయడంతోపాటు ఓ మేధావిగా శైశవ దశలో కమ్యూనిస్టు పార్టీకి కొన్ని విషయాల్లో ఇతడు మార్గదర్శకం చేశాడు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం, మాతృదేశ దాస్య విముక్తి ఉద్యమాన్ని సమన్వయం చేసి పార్టీని నడిపించడంలో ఇతడు చూపిన మార్గమే దిక్సూచిలా నిలిచింది. సోవియట్‌ యూనియన్‌పై నాజీల దాడి నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ తీసుకున్న వైఖరికి జాతీయవాదుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అప్పుడు ఆంధ్ర కమ్యూనిస్టులు ఇతడి నాయకత్వాన సంయమనంతో ముందుకు సాగారు. సుభాష్‌చంద్రబోస్‌లాంటి పొరబడిన దేశభక్తులపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేయడాన్ని తొలినుంచి ఇతడు వ్యతిరేకించారంటే ఈయన ముందుచూపు, పరిస్థితులపై ఈయన అవగాహన స్పష్టమవుతోంది. ఇతడు రాసిన వ్యాసాలు 'గాంధీ-ఇర్విన్‌ నాటినుంచి జమీందారీ పోరాటం వరకు' కాంగ్రెస్‌ నిర్వహించిన రాజకీయాలు ఏమిటో అర్థమవుతాయి. ఒక దశలో కమ్యూనిస్టు పార్టీపై జరిగిన కువిమర్శలను తిప్పికొట్టడంలో ఇతడు తన వ్యాసాలను ఆయుధాలుగా ఎక్కుపెట్టాడు.
 
==పాత్రికేయజీవితం==
మద్దుకూరి చంద్రశేఖరరావు పాత్రికేయ జీవితం 1937లో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభించిన పత్రిక [[నవశక్తి]] సంపాదకునిగా ప్రారంభమయ్యింది. పార్టీ రహస్యపత్రిక [[స్వతంత్ర భారత్‌]], 1942-45 మధ్య ప్రజాశక్తి వారపత్రి కకు, 1946నుంచి 1948 నిర్బంధ కాలంలో మూసివేసే వరకు [[ప్రజాశక్తి]] దినపత్రిక సంపాదకులుగా పనిచేశాడు. 1948లో అరెస్టు అయ్యాడు. 1952లో [[విశాలాంధ్ర]] దినపత్రిక ప్రారంభంలో ప్రధాన సంపాదకునిగా వ్యవహరించాడు. 1964నుంచి68 వరకు సంపాదక వర్గంలో ఒకనిగా ఉన్నాడు. [[ప్రగతి]] సచిత్రవారపత్రికకు 1969 నుండి 1974 వరకు ప్రధాన సంపాదకునిగా వ్యవహరించాడు. ఇతని పత్రికారచన ఎంతో సులువుగా, సూటిగా, సరళంగా పల్లె ప్రజలను లక్ష్యంగా చేసుకొని సాగింది.
 
==రాజకీయజీవితం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1452578" నుండి వెలికితీశారు