రాళ్ళబండి కవితాప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''రాళ్ళబండి కవితాప్రసాద్''' ప్రముఖ అవధాని, కవి.'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రాళ్ళబండి కవితాప్రసాద్''' ప్రముఖ అవధాని, కవి. ఇతడు [[కృష్ణా జిల్లా]], [[గంపలగూడెం]] మండలం, [[నెమలి (గంపలగూడెం)|నెమలి]] గ్రామంలో [[1961]]లో జన్మించాడు. ఇతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వేంకటేశ్వర ప్రసాదరాజు. కవిత్వం పట్ల మోజుతో తనపేరును కవితాప్రసాద్‌గా మార్చుకున్నాడు. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో అవధానవిద్యపై పి.హెచ్.డి. చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతడు గ్రూప్-1 అధికారిగా సాంఘిక సంక్షేమ శాఖలో సేవలను అందించాడు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖకు రెండు పర్యాయాలు సంచాలకుడుగా పనిచేశాడు. ఇతని పర్యవేక్షణలో [[నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు]] [[తిరుపతి]]లో జరిగాయి. ఇతడు [[తెలంగాణ]] రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇతడు [[2015]] [[మార్చి 15]]న హైదరాబాదులో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో హృద్రోగంతో మరణించాడు.
'''రాళ్ళబండి కవితాప్రసాద్''' ప్రముఖ అవధాని, కవి.
 
==సాహిత్య సేవ==
ఇతడు 500కు పైగా అవధానాలను చేశాడు. వాటిలో అష్టావధానాలతో పాటుగా శతావధానాలు, ద్విశతావధానాలు ఉన్నాయి. సంప్రదాయ అవధానంతో పాటు కథ, వచనకవిత, గణితం వంటి అనేక ప్రక్రియలను అవధానంలో చొప్పించాడు. ఒకసారి 25 నిమిషాలలో విచిత్ర అష్టావధానం చేసి పండితుల మెప్పు పొందాడు. వరంగల్లు భద్రకాళి ఆలయంలో '''ఏకదిన శతకరచన ధార''' అనే కార్యక్రమాన్ని చేపట్టి ఒకే రోజులో ఆశువుగా శతకాన్ని చెప్పాడు. '''ఆశుకవితా ఝరి''' పేరుతో గంటకు 500 పద్యాలు ఆశువుగా చెప్పాడు.
===రచనలు===
# అగ్నిహంస
# ఒంటరి పూలబుట్ట
# దోసిట్లో భూమండలం
# కాదంబిని
# సప్తగిరిధామ శతకం
# పద్యమండపం