నాటక విజ్ఞాన సర్వస్వం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
ఈ సంపుటంలో 80 మంది రచయితలు పాలుపంచుకున్నారు. ప్రాచ్చ-పాశ్చాత్య నాటక సాహిత్యంమీద, రంగస్థల పరిణామ దశల మీద కూలంకషంగా పరిశోధన చేసి పట్టుసాధించి తెలుగులో అనేక గ్రంథాలు, పరిశోధక వ్యాసాలు వెలువరించి నాటకరంగాన్ని సుసంపన్నం చేసిన సుప్రసిద్ధ పరిశోధకులు, ప్రస్తుత నాటక విజ్ఞాన సర్వస్వం సంపుటానికి మౌలిక రూపానిచ్చిన కీ.శే. శ్రీనివాస చక్రవర్తికి (1911-1976) గారికి అంకితమిచ్చారు.
 
నాటకరంగానికి పరిమితమైన ప్రస్తుత సంపుటాన్ని తనదైన ప్రణాళికతో 1960 నాటికి నాటక విజ్ఞాన సర్వస్వం పేరుతో మౌలికంగా తయారుచేసినవారు కీ.శే. [[శ్రీనివాస చక్రవర్తిగారుచక్రవర్తి]] గారు. వీరు తెలుగు నాటకరంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ, భారతీయ, ప్రపంచ నాటకరంగాలను స్పృశించి వదిలేశారు. ఆధునిక నాటకరంగంలో విప్లవాత్మకమైన మార్పులెన్నో జరిగిన దృష్ట్యా 1960 నుండి 2006 వరకు సమకాలీన పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని ఎన్నో మార్పులు చేర్పులు చేయవలసిన అవసరం ఏర్పడింది.
 
మారుతున్న కాలానికి, అభిరుచులకు, అవసరాలకు అనుగుణంగా, సమకాలీన నాటకరంలోని ప్రముఖ వ్యక్తులను, సమాజాలను, నాటకరచనా విధానం, ప్రదర్శనా పద్ధతుల్లో చోటుచేసుకున్న మార్పులను ప్రయోగాలను దృష్టిలో ఉంచుకొని ఇందులో ఎన్నో కొత్త అంశాలను చేర్చడం జరిగింది.