జరాయువు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
మెటాథిరియా లేక మర్సుపైలియా (కోష్టక క్షీరదాలు) జీవులైన కంగారు (Macropus), అపోసం (డైడెల్పిస్) వంటి జీవులలో జరాయువు సొనసంచి మరియు పరాయువు వలన ఏర్పదుతుంది.బ్లాస్టోసిస్ట్ అడుగుభాగము నుండి సొనసంచి అభివృద్ధి చెందుతుంది. ఇది పెద్ద పరిమాణములో ఉండి, పిండాన్ని మరియు ఉల్భమును పూర్తిగా చుట్టి ఉంటుంది.ఆళిందము చిన్నదిగా ఉండి, పరాయువుతో కలవదు. సొనసంచి పెద్దదిగా మారి, దానికుడ్యము పరాయువుతో సంబంధాన్ని ఏర్పరచుకొని, వేళ్ళవంటి అంకురికలను గర్భాశయ కుడ్యములోనికి పంపిస్తుంది. సొనసంచి కుడ్యము పరాయువుతో కలిసి తర్వాత, దీనినుండి పీతకరక్త నాళాలు ఏర్పడతాయి. ఈ రక్తనాళాల ద్వార గర్భాశయము నుండి పోషక పదార్ధాలు పెరుగుచున్న పిండమునకు రవాణా అవుతాయి. ఇటువంటి జరాయువును సొనసంచి జరాయువు లేక పరాయు-పీతకజరాయువు అని అంటారు.
 
సొనసంచి జరాయువు బాగా అభివృఅద్ధి చెందకపోవటము వలన, పిండమునకు సరిగాపోషణ లంభిచక, పిండము పెరగుదల నిర్ణీతంగా ఉంటుంది. అందువలన అపరిపక్వస్ధితిలో ఉన్న పిల్లలను కంటాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/జరాయువు" నుండి వెలికితీశారు