దశ రూపకాలు: కూర్పుల మధ్య తేడాలు

4 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Rajasekhar1961, పేజీ దశ రూపకములు ను దశ రూపకాలు కు తరలించారు)
దిద్దుబాటు సారాంశం లేదు
# నాటకము: ఇందులో ఇతివృత్తం ప్రఖ్యాతమయినది(పురాణేతిహాసాల నుండి గ్రహించిన వస్తువు). నాయకుడు ధీరోదాత్తుడు. వీరము కానీ, శృంగారము కానీ ప్రధాన (అంగిరసము) రసముగా ఉంటుంది.ఇతర రసములు అంగములుగా ఉండవచ్చు.వీటిలో 5 నుంచి 10 వరకు అంకములు ఉండవచ్చు. పూర్వకావ్యాలలో నాటకములు అనే ప్రక్రియలో రచించబడినవి - కాళిదాసు రచించిన శాకుంతలం,మాళవికాగ్నిమిత్రము మొదలైనవి.
# ప్రకరణము: ఇందులో ఇతివృత్తం కల్పితమై ఉంటుంది. నాయకుడు ధీరశాంతుడు. శృంగారము ప్రధాిన రసంగా ఉంటుంది. నాయకుడు, మంత్రి కానీ, వణిజుడు కానీ, బ్రాహ్మణుడు కానీ అయి ఉండాలి. ఇందులో కుల స్త్రీ గానీ, వేశ్యగానీ లేదా ఇద్దరూ కానీ కావ్య నాయికలై ఉండవచ్చు. ఉదాహరణలు - మాలతీ మాధవం, తరంగవృత్తం అనే నాటకాలు, శూద్రకుడు రచించిన మృచ్ఛకటిక నాటకం.
# [[భాణము]] : ఇందులో ఇతివృత్తం కల్పితము. నాయకుడు ధూర్తుడయిన విటుడు. శృంగార, వీర రసములతో ఉంటుంది.ఇందులో ఒకటే అంకం ఉంటుంది.
# ప్రహసనము: ఇందులో కథ కల్పితం. నాయకులు పాషండులు అంటే వేదబాహ్యులు.హాస్యరసమే ఇందులో ప్రధానం.
# డిమము : ఇందులో ఇతివృత్తం ప్రసిద్ధం. రౌద్ర రసము ఇందులో ప్రధానరసము. వీర,శృంగార రసములు అంగ రసములుగా ఉండవచ్చు. నాయకుడు ధీరోదత్తులైన దేవ, గంధర్వ, పిశాచ జాతులకు చెందినవారు. నాలుగు అంకములుంటాయి.మాయలు, ఇంద్రజాలం, యుద్ధం, గ్రహణములు ఇందులో వర్ణించబడతాయి.
65

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1453121" నుండి వెలికితీశారు