బంగారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
పరమాణువు లోని ప్రోటాను మరియు న్యుట్రానుల మొత్తం సంఖ్యను ఆ మూలకం యొక్క భారసంఖ్య అంటారు. పరమాణువులోని ప్రోటాను సంఖ్య మూలకాన్ని నిర్ణయిస్తుంది. ప్రతిమూలకంలో ప్రోటానుల సంఖ్య స్థిరంగా ఉంటాయి. అయితే ప్రోటానుల సంఖ్య స్థిరంగా వుండి, న్యుట్రానుల సంఖ్య మారినచో ఆ నిర్మాణాన్ని ఐసోటోప్ అంటారు. బంగారానికి ఒకటే స్థిరమైన ఐసోటోప్ ఉన్నది.అది<sup>197</sup>AU. ఈ ఐసోటోప్ స్వాభా వికముగా లభించే ఐసోటోప్. కాని అణుధార్మికతను విడుదలచేసే,పరమాణు భారం 169-205 వున్న రేడియో ఐసోటోప్లు 36 వరకు ఉన్నాయి. అందులో <sup>198</sup>AU అనే ఐసోటోప్‌ను కాన్సరు చికిత్సలో, colloid రూపంలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా లివరు మరియు పొత్తికడుపుల రుగ్మతల నిర్ధారణ విధానాలలోను ఉపయోగిస్తారు .
==బంగారం వినియోగం==
ప్రస్తుతం లభిస్తున్నబంగారంలో 50 % బంగారాన్ని ఆభరణాలు చెయ్యుటకు, 40 %ను మూలధనం పెట్టుబడిగా, 10%ను నాణేల తయారికి,మరియు ఇతరత్రా పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు. శుద్ధమైన బంగారాన్ని 24 కారెట్లు (24 K24K )అంటారు. 22K అనగా 24 భాగాలలో 22 భాగాలు బంగారం,మిగిలిన 2 భాగాలు రాగి లేదా వెండి వంటి ఇతరలోహాలు కలుపబడి ఉండును.
 
 
"https://te.wikipedia.org/wiki/బంగారం" నుండి వెలికితీశారు