బంగారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 62:
==బంగారం వినియోగం==
ప్రస్తుతం లభిస్తున్నబంగారంలో 50 % ఆభరణాలు చెయ్యుటకు, 40%ను మూలధనం పెట్టుబడిగా,10%ను నాణేల తయారికి,మరియు ఇతరత్రా పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు.శుద్ధమైన బంగారాన్ని 24 కారెట్లు(24K )అంటారు. 22K అనగా 24 భాగాలలో 22 భాగాలు బంగారం,మిగిలిన 2 భాగాలు రాగి లేదా వెండి వంటి ఇతరలోహాలు కలుపబడి ఉండును. కేవలం వెండి మాత్రమే కలుపబడిన 14K మరియు 18K బంగారం, ఆకుపచ్చ–పసుపు రంగుల మిళితంగా ఉంటుంది. దీనిని పచ్చ బంగారు అందురు.తెల్ల బంగారు మిశ్రమ లోహాం, పల్లాడియం లేదా నికెల్ లోహాన్ని బంగారంలో కలపడం వలన ఏర్పడును.17.3 %నికెల్, 5.5%జింకు, మరియు 2.2% రాగి కలిపిన 18K బంగారు వెండిలా కనబడుతుంది. బంగారంయొక్క క్షయికరణను నిలువరించే గుణంవలన దీన్ని కంప్యుటర్ మరియు ఎలక్ట్రికల్ పరికరాలలో కనెక్టరులుగా ఉపయోగిస్తారు .ప్రపంచ బంగారు సమాఖ్య (world Gold council) ప్రకారంఒక కరవాణి(cell phone)లో కనిష్టం 50 మి.గ్రాముల బంగారం వినియోగింపబడి ఉండే అవకాశము కలదు.
==బంగారుపూత/తాపడం==
 
ఇతర లోహనిర్మిత ఆభరణాలు మరియు వస్తువుల ఉపరితలంపై బంగారాన్ని పలుచని పూతగా లేపనం చెయ్యడానిని బంగారు తాపకం లేదా తాపడం అందురు. ఆంగ్లంలో గోల్డ్ ఫిల్లింగ్ (gold filling)అందురు.
 
ఇలా పలుచగా బంగారపుపూత కలిగిన ఇత్తడి లేదా వెండి ఆభరణాలను రోల్డ్ గోల్డ్ ఆభరణాలు అందురు. రోల్డు గోల్డు ఆభరణాలను సాధారణంగా ఎలక్ట్రో ప్లేటింగు విధానంలో చెయ్యడం కద్దు.
 
 
 
"https://te.wikipedia.org/wiki/బంగారం" నుండి వెలికితీశారు