"బంగారం" కూర్పుల మధ్య తేడాలు

252 bytes added ,  6 సంవత్సరాల క్రితం
బంగారం చాలా వరకు చాలా ఆమ్లాల విడి చర్యకు గురికాదు,కరుగదు.కాని నైట్రిక్ ఆమ్లం,మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లంను కలిపి తయారుచేసిన “ఆక్వా రెజియా”అనే ద్రవంలో కరుగుతుంది.పై రెండు ఆమ్లాల మిశ్రమ ద్రవం బంగారంను టెట్రా క్లోరైడి అయానుగా పరివర్తనం చెందిస్తుంది. అలాగే సైనైడ్ యొక్క క్షార ద్రావణాలలో బంగారం కరుగుతుంది. బంగారం పాదరసంలో కరుగుతుంది. బంగారం పాదరసంలో కరుగుట వలన ఏర్పడిన మిశ్రమ ధాతువును అమాల్గం(Amalgam)అందురు. తెలుగులో ''పారదమేళనము '' లేదా రసమిశ్రలోహము మరియు నవనీతమూంటారు.సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద పాదరసంలో బంగారం కరిగి రసమిశ్రలోహము మిశ్రమ ధాతువుగా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన ఆమాల్గం నత్రికామ్లం(నైట్రిక్ ఆసిడ్)లో కరుగదు.(వెండి మరియు క్షారలోహాలు నత్రికామ్లంలో కరుగుతాయి). ఒక ఔన్సు బంగారాన్ని 300 చదరపు అడుగుల పలుచని రేకు /పత్రంలా సాగ గొట్టవచ్చును. బంగారం యొక్క భౌతిక గుణగణాలు నిజంగావిశ్మయాన్ని కలిగించేలా కనిపిస్తాయి .అత్యంత పలుచని రేకులుగా సాగే అద్భుతమైన భౌతిక ధర్మాన్ని కలిగివున్నది. అంతే కాదు కేశముల కన్నసన్నని తీగెలుగా సాగుతుంది.ఒక ఔన్సు బంగారం నుండి 50 మైళ్ళ పొడవున్న తీగెను తీయవచ్చును .కేవలం ఒకగ్రాము భారమున్న బంగారాన్ని ఒక చదరపు మీటరు వైశాల్యంగల రేకుగా సాగతీయ వచ్చును. పలుచగా సాగగొట్ట బడిన బంగారు పత్రంనుండి వెలుతురు పచ్చని ఛాయగలిగిన నీలిరంగుగా వెలువడుతుంది. ఒకగ్రాము బంగారాన్ని 20 మైక్రో మీటర్లు మందమున్న,165 మీటర్ల పొడవున్న తీగెలా సాగతీయ వచ్చును.
 
మిగతా లోహంలతో కూడా బంగారు సంయోగం చెందును. కాని ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఈమిశ్రమ ధాతువులు ఏర్పడును. ఇతరలోహాలను బంగారంలో దాని యొక్క మెత్తదనాన్ని తక్కించి దృడత్వం పెంచుటకై కలిపెదరు.గాలి, చెమ్మ, లేదా క్షయికరణ పదా ర్థాలు బంగారం పై ఎటువంటి రసాయనిక చర్యను కలిగించలేవు.ఒస్మియం (osmium )తరువాత బరువైన లోహం బంగారమే. ఒస్మియం ఒక ఘనమీటరుకు 22,588 కిలోలు ఉంటే బంగారం 19,300 కిలోలు తూగు తుంది<ref name="Densest">{{cite journal|title=Osmium, the Densest Metal Known|author=Arblaster, J. W.|journal=Platinum Metals Review|volume=39|issue=4|date=1995|page=164|url=http://www.platinummetalsreview.com/dynamic/article/view/pmr-v39-i4-164-164}}</ref>. శుద్ధమైన చాలా లోహాలు సాధారణంగా గ్రే లేదా వెండిలా తెల్లగా ఉంటాయి. కాని బంగారం మాత్రం ఎరుపు ఛాయకలిగిన పసిమిరంగులో ఉంటుంది. బంగారంలో కలుపబడే రాగి,వెండి ,నిష్పత్తిని బట్టి బంగారం రంగులో వ్యత్యాసం కన్పిస్తుంది. బంగారం యొక్క స్వచ్చత పాళ్ళను ఫైన్నెస్(fineness )లేదా కారెట్ (karat)లల్లో కొలుస్తారు. బంగారాన్ని పైన్నెస్‌లో అయ్యినచో వెయ్యిలో వంతుగా గణన చేయుదురు. ఉదాహరణ కు పైన్నేస్ 885 అనగా అందులో బంగారం 885 వంతులు, మిగిలిన 115 వంతులు వెండి, రాగి వంటి ఇతరలోహాలు కలుపబడి ఉన్నాయని అర్థం.అలాగే 24 కారెట్ అనేది, కల్తీలేని స్వచ్చమైన బంగారానికి సూచిక. ఉదాహరణకు 22 కారెట్ల బంగారం అనగా, అందులో బంగారం 22 భాగాలు, మిగిలిన 2 భాగాలు రాగి, లేదా వెండి వంటి ఇతర లోహాలు కలిసి ఉన్నాయని అర్థం.
 
==యాంత్రిక గుణములు/ ధర్మములు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1454949" నుండి వెలికితీశారు