రాళ్ళబండి కవితాప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
 
==జీవిత విశేషాలు==
కవితాప్రసాద్ [[కృష్ణా జిల్లా]], [[గంపలగూడెం]] మండలం, [[నెమలి (గంపలగూడెం)|నెమలి]] గ్రామంలో [[1961]], [[మే 21]]వ తేదీన జన్మించాడు. ఇతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వేంకటేశ్వర ప్రసాదరాజు. కవిత్వం పట్ల మోజుతో తన పేరును కవితాప్రసాద్‌గా మార్చుకున్నాడు. ఈయన తండ్రి కోటేశ్వర రాజు గారు తెలుగు పండితులు. తల్లి పేరు రత్నవర్ధనమ్మ. [[సత్తుపల్లి]]లో గణితశాస్త్రం ఐచ్చిక అంశంగా పట్టభద్రుడయ్యాడు. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో అవధానవిద్యపై [[ఆచార్య మసన చెన్నప్ప|మసన చెన్నప్ప]] పర్యవేక్షణలో పి.హెచ్.డి. చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతడు గ్రూప్-1 అధికారిగా సాంఘిక సంక్షేమ శాఖలో సేవలను అందించాడు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖకు రెండు పర్యాయాలు సంచాలకుడుగా పనిచేశాడు. ఇతని పర్యవేక్షణలో [[నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు]] [[తిరుపతి]]లో జరిగాయి. ఇతడు [[తెలంగాణ]] రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. మంత్రి [[కడియం శ్రీహరి]] వద్ద పీయస్ గా బాధ్యతలు నిర్వర్తించాడు.ఇతడు [[2015]] [[మార్చి 15]]న హైదరాబాదులోని బంజారా హిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో హృద్రోగంతో మరణించాడు.
 
==సాహిత్య సేవ==