కాముని పౌర్ణమి నాటి ఉత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
===[[తెలంగాణా]] గ్రామీణ ప్రజలకు కాము [[పౌర్ణమి]] అనందదాయకమైన పండుగ. [[వెన్నెల]] రాత్రులలో గుంపులు గుంపులుగా పౌర్ణమి ఇంకామూడు రోజులుందనగానే ఈ వినోద కార్యక్రమాలు ప్రారంభ మౌతాయి. కాముని పున్నమి ఒక్క తెలంగాణా లోనె కాక భారత దేశమంతటా, ముఖ్యంగా ఉత్తర హిందూస్థానంలో [[హోళీ]] పండుగ రూపంలో జరుగుతుంది. వరుసా వావీ లేకుండా ఒకరి మీద మరొకరు వసంతాలు విరజిమ్ముకుంటూ, ఒడలు మరచి తన్యయత్వంలో ఈ వినోదాలను జరుపుకుంటారు. కులభేదాలు, వైషమ్యాలూ, ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భేద భావం లేకుండా ఈ వినోదాలు ఎంతో అన్యోన్యంగా సాగుతాయి. ఆంధ్ర దేశంలో ఈ వసంతాలు ముఖ్యంగా వివాహానంతరం కంకణాలు విప్పే రోజున ఏంతో ఉల్లాసంగా జరుగుతాయి.===
==ఊరంతా వసంత వేడుకలు==
అంతేకాక పెద్ద పెద్ద దేవాలయ క్షేత్రాలలోనూ, పల్లెల్లో దేవాలయ కళ్యాన వుత్సవాలలో ముఖ్యంగా సీతా కళ్యాణ సమయంలో బండ్ల మీద పెద్ద పెద్ద గంగాళాలలో రంగు రంగుల నీళ్ళతో నింపి, మేళ తాళాలతో ఉత్సవంగా బయలు దేరి వీథుల్లో కనిపించిన వారందరి మీదా వసంతాలు జల్లేవారు. అంతే కాదు తలుపులు మూసుకుని ఇళ్ళలో వున్న వారిని కూడా ఇళ్ళలో జొరబడి స్త్రీ పురుష భేదం లేకుండా అందర్నీ వసంతంతో ముంచి వేసేవారు. ఈ సందర్భంలో కొంత మంది మీద గులామునూ, పిడకలనూ, కప్పలనూ, మామిడి టెంకలనూ దండలుగా కట్టి మెడలో వేసేవారు. ఇలా వూరంతా మేళ తాళాలాతో వినోదాలతో పిన్నలు పెద్దలు కలిసి ఆటలతో పాటలతో సంతోషంగా ఈ వసంతోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండువుగా నిర్వహించేవారు. వూరి వారందరినీ ఇలా రంగుల వసంతంతో ముంచినప్పుడు స్త్రీలు గానీ, పురుషులు గానీ ఎవరూ కోపగించుకునే వారు కారు. అదొక పవిత్ర కార్యంగా భావించే వారు. దానిని ఒక పవిత్ర వుత్సవంగా సంతోషంగా ఆమేదించే వారు. ఈ వసంతోత్సవాలు కులమతాలకు అతీతంగా ధనిక పేద ఐక్యతకు చిహ్నంగా అరమరికలు లేకుండా బ్రతికే గ్రామ ప్రజలకు దర్పణగా జరిగేవి.