బిజ్నౌర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 71:
జిల్లాలో హిందీ మరియు ఉర్దూ యాస కలిగిన పశ్చిమ హిందీ భాషవాడుకలో ఉంది.
 
==సంస్కృతి==
==Culture==
బిజ్నోర్ జిల్లా ప్రజలకు వ్యవసాయం ప్రధానవృత్తి. చెరుకు ప్రధాన పంటగా పండిస్తున్నారు. జిల్లాకు బి.పి.ఒ కంపనీలలో పనిచేస్తున్న ఉద్యోగులు కొంతమంది సమైఖ్యమై జిల్లాలో " సుక్‌స్యాం ఇంఫర్మేషన్ సర్వీసెస్ " పేరుతో గ్రామీణ బి.పి.ఒ స్థాపించారు. వీరంతా బిజ్నోర్ మరియు చందర్పూర్‌కు చెందినవారు. వీరంతా పైచదువులకు ఢిల్లీ వెళ్ళినవారే. 14 సంవత్సరాలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలలో పనిచేసిన తరువాత తిరిగి స్వస్థలానికి వచ్చి ఈ సంస్థను ప్రారంభించారు. కొన్ని సాంఘిక కారణాలు మరియు బిజ్నోర్ మరియు చందర్పూర్ యువతకు ఉపాధి కల్పించాలన్న ధ్యేయంతో ఈ సంస్థ స్థాపించబడింది.
 
==పర్యాటకం==
విదుర్ కుటి :- ఇది బిజ్నోర్‌కు 12 కి.మీ దూరంలో ఉంది. పౌరాణిక ప్రాశస్థ్యం కలిగిన ప్రదేశాలలో ఇది ఒకటి. విదురుడు తన జీవితచరమాంకం ఇక్కడ పూర్తిచేడని భావిస్తున్నారు. శ్రీక్రిష్ణుడు ఇక్కడకు విజయం చేసాడని భావిస్తున్నారు. రవ్లి వద్ద విరిగిపోయిన స్థితిలో కణ్వాశ్రమం ఉంది. అభిఙాన శాకుంతలం నాయిక శకుంతల పెరిగిన ప్రదేశం ఇది. హస్థినాపుర చక్రవర్తి దుష్యంతుడు వేటాడుతూ అక్కడకు వచ్చి శకుంతలను చూసి ప్రేమించి గాంధర్వ వివాహం చేసుకున్నాడు. మహాభారతం కాలంలో కౌరవ పాండవులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇరువౌపులా ఉన్న స్త్రీలు, వృద్ధులు మరియు పిల్లలు విదురుని ఆశ్రయం కోరారు. విదురిని వద్ద తగినంత ప్రదేశం లేదు కనుక ప్రదేశాన్ని విస్తరించి వారికి ఆశ్రయం కల్పించాడు. దీనిని ప్రస్తుతం " ధారానగర్" అని పిలుస్తున్నారు. ధారానగరుకు 12 కి.మీ దూరంలో గంగా తీరంలో గంజ్ ఉంది. ఇక్కడ పురాతన ఆలయాలు మరియు ఆశ్రమాలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/బిజ్నౌర్_జిల్లా" నుండి వెలికితీశారు