వికీపీడియా:ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Nenusaitam88 (చర్చ) చేసిన మార్పులను 2620:117:C080:520:1A03:73FF:FE0A:7269 యొక్క చివర...
పంక్తి 1:
Sun Temple-Nandikotkuru(Kurnool dist),సూర్యదేవుడి ఆలయం-నందికొట్కూరు(కర్నూలు జిల్లా )
 
*ఈవరుసతో పాటు మొదటి 6 బుల్లెట్ పేరాలు దయచేసి మార్చవద్దు
*ఇది ఒకే సమయంలో ఒక్కరు మాత్రమే వాడదగిన ప్రయోగశాల. మీరు ఇక్కడ టైపింగ్ నైపుణ్యం మెరుగు పరచుకొనడానికి, వికీపీడియా టాగ్లు పరీక్ష చేయడం చేయవచ్చు.
*ఇక్కడ ఇతరులకు ఇబ్బంది/నొప్పి కలిగించే విషయాలు రాయవద్దు.
*ఇక్కడ వ్రాసినది అవసరమనుకుంటే, మీ ప్రయోగం అయిన తరువాత మీ సభ్య పేజీలలో పదిలపరచుకోండి. అలాగే మీ సభ్యపేజీని లేక దాని ఉపపేజీలను ప్రయోగశాల వాడుకోవటం మరింత మంచిది.
*ప్రయోగం చేయటానికి "వికీపీడియా:ప్రయోగశాల " పైవరుసలో నున్న "సవరించు" అన్న అదేశం బొత్తాము పై నొక్కండి.
*'''ఈ వరుస క్రింది గీత తరువాత మీరు ప్రయోగాలు చేయవచ్చు'''
== ప్రయోగశాల==
 
తెలుగు టైపింగ్ చెయడం ఎలా రావు
ఉషాకిరణాల్లో బ్రహ్మదేవుడూ, మధ్యాహ్నపు ఎండలో పరమశివుడూ, సంధ్యాకాంతుల్లో శ్రీమహావిష్ణువూ ఉంటారని చెబుతారు. ముమ్మూర్తులా త్రిమూర్తులను తనలో ఇముడ్చుకున్న సూర్యనారాయణమూర్తి జన్మదినమే రథసప్తమి (ఫిబ్రవరి 6). ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలోని పురాతన సూర్యాలయ పరిచయం...వెలుగుల దేవరా...వందనం!
Telugu lo ela rayali?
 
లిప్యంతీకరణం ఒక విథానం.మనం వాడే ఆపరేటింగ్ సిష్టం లో కొన్ని మార్పులు చేయటం రెంఢవ విధానం.నేను ఈ మొత్తం వాక్యలని ఈ రెండవ విధానం లోనే వ్రాసాను.
కర్నూలు జిల్లా నందికొట్కూరులోని సూర్యదేవుడి ఆలయం ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. ఈ క్షేత్రంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాతః కిరణాలు నేరుగా స్వామివారి పాదాల్ని తాకుతాయి. ఆలయం మధ్యలో కూర్మయంత్రం ఉండటం మరో విశిష్టత. ఆ కారణంగానే, ఇక్కడ సూర్యారాధన చేసిన వారికి ఉత్తమ ఫలితాలుంటాయని చెబుతారు అర్చకులు. పదమూడో శతాబ్దంలో చోళవంశీయుడైన సిరిసింగరాయలు ఈ ప్రాంతానికి వేటకొచ్చాడు. అలసిసొలసి ఓ చెట్టు నీడన సేదతీరుతుండగా సూర్యభగవానుడు కలలో కనిపించి...అక్కడ తనకో ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట. ఆ ఆనతి ప్రకారం సిరిసింగరాయలు చక్కని సూర్యాలయాన్ని కట్టించాడని ఐతిహ్యం.
 
గర్భాలయంలో మూలమూర్తి వైభోగాన్ని మాటల్లో వర్ణించలేం. కుడి చేతిలో తెల్లని పద్మం ఉంటుంది. ఎడమ చేయి అభయముద్రలో కనిపిస్తుంది. చోళుల పాలన అంతరించిపోయాక కూడా ఎంతోమంది రాజులు స్వామివారిని కొలిచారు. కాలక్రమంలో ఆ చారిత్రక ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. పదహారేళ్ల క్రితం భక్తజనం తలోచేయీ వేసి జీర్ణోద్ధారణ చేశారు. ఆదివారం వచ్చే అమావాస్యను భాను అమావాస్య అంటారు. భాను సప్తమి కూడా అంతే ప్రత్యేకమైంది. ఆ రోజుల్లో భాస్కరుడిని విశేష పూజలతో కొలుస్తారు. సూర్యగ్రహ శాంతులు, హోమాలు, అభిషేకాలు, జిల్లేడు ఆకు పూజలూ నిర్వహిస్తారు. జిల్లేడు ఆకులంటే సూర్యుడికి చాలా ఇష్టం. వీటినే అర్క పత్రాలనీ అంటారు. రథ సప్తమినాడు స్వామివారి ఆలయంలో ఘనంగా కల్యాణం నిర్వహిస్తారు. పరిసర జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. కర్నూలుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందికొట్కూరు పట్టణాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేం కాదు.
 
రథ సప్తమి...
సప్తసప్త మహాసప్త
సప్తద్వీప వసుంధరా
సప్తార్క పరమాధార
సప్తమీ రథసప్తమీ
సూర్యోదయం జరిగే తూర్పు దిక్కునే ముందుగా సృష్టించాడట బ్రహ్మ. మాఘశుద్ధ సప్తమినాడు తొలిసారిగా సూర్యుడు ఏడుగుర్రాల రథమెక్కివచ్చి కర్మసాక్షిగా బాధ్యతలు స్వీకరించాడంటారు. ఆ సందర్భంగానే ఏటా రథసప్తమి జరుపుకుంటాం. సూర్యవ్రతాన్నీ నిర్వహిస్తాం. ఆరోజు, తలమీద ఏడు జిల్లేడు ఆకులు కానీ రాగి ఆకులు కానీ పెట్టుకుని తలస్నానం చేయడం సంప్రదాయం. కొత్తబియ్యం, కొత్త బెల్లంతో వండిన పాయసాన్ని చిక్కుడు ఆకులమీద వడ్డించి, నైవేద్యంగా పెడతారు. ముంగిళ్లలో రథం ముగ్గేసి సూర్యనారాయణుడికి ఆహ్వానం పలుకుతారు. ఆదిత్య హృదయాన్ని పఠించి సూర్య కటాక్షం పొందుతారు.
 
రథసప్తమికి వాతావరణ పరంగా కూడా ప్రాధాన్యం ఉంది. నాటితో సూర్య గమనంలోనూ మార్పు వస్తుంది. శీతకాలం నుంచి వసంత, గ్రీష్మ రుతువుల దిశగా మార్పులు సంభవించే సమయమూ ఇదే. రథసప్తమి నాటి బ్రహ్మీ ముహూర్తంలో ఆకాశంలోని ప్రధాన నక్షత్రాలన్నీ తేరు ఆకారంలో అమరిపోయి సూర్యరథాన్ని గుర్తుకు తెస్తాయంటారు. సూర్యుడికి సంబంధించినంతవరకూ ఏడు - చాలా విశిష్టమైన సంఖ్య. సప్తమి - ఏడో రోజు. సూర్యుడి గుర్రాలు ఏడు. సూర్యకాంతిలోని వర్ణాలు కూడా ఏడే. సూర్యారాధన చాలా ప్రాచీనమైంది. సూర్యుడిని స్తుతిస్తూ వేదాల్లో అనేక రుక్కులున్నాయి. వివిధ ఆదిమతెగల్లో సూర్యారాధన ఉంది. భారతీయులు అన్న మాటకు సూర్యారాధకులు అనే అర్థమూ ఉందంటారు.
పురాణేతిహాసాల్లో సూర్యారాధన ప్రస్తావనలు అనేకం. రామాయణంలో - రఘువంశీయుడైన శ్రీరాముడు ఆదిత్య హృదయ పారాయణ తర్వాతే రావణ సంహారం చేశాడు. ఆంజనేయుడు భాస్కరుడి వద్దే విద్యాభ్యాసం చేశాడు. భారతంలో - పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు...ద్రౌపది సూర్యుణ్ణి ప్రార్థించే అక్షయపాత్రను పొందింది. భాగవతంలో - సత్రాజిత్తుకు శమంతకమణిని ఇచ్చిందీ సూర్యుడే.
 
ఆరోగ్య నారాయణుడు
ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్‌ - ఆరోగ్యానికి సూర్యుడే అధిపతి. భానుదేవుడు నమస్కార ప్రియుడు. సూర్యనమస్కారాలు శారీరక మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయని ఆధునిక పరిశోధనలు అంగీకరిస్తున్నాయి. 'సన్‌ యోగా', 'సన్‌ థెరపీ' లాంటి చికిత్సలు పాశ్చాత్యదేశాల్లోనూ ఆదరణ పొందుతున్నాయి. ఆరునూరైనా తప్పని ఆ కాలగతి, ఆధునిక మానవుడికి ఓ క్రమశిక్షణ పాఠం. తిమిరంతో సాగించే నిత్య సమరం, సమస్యలతో సతమతమయ్యే సగటు జీవులకు ఆశావాద సూత్రం. ఇవ్వడమే తప్ప పుచ్చుకోవడం తెలియని మహాదాతృత్వం - సూర్య కిరణాలు మోసుకొచ్చే మానవతా సందేశం.
తం సూర్యం ప్రణమామ్యహమ్‌!
 
Courtesy with- కె.రాఘవేంద్రగౌడ్‌, ఈనాడు, కర్నూలు--ఫొటోలు: సోమలింగేశ్వరుడు@eenadu sundy 02-feb-2014