"సాదనాల వేంకటస్వామి నాయుడు" కూర్పుల మధ్య తేడాలు

ఇతని రచనలు పలు దిన, వార, పక్ష, మాస పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని గురించి పరిచయ వ్యాసాలు కూడా పలుపత్రికలలో వచ్చాయి. ఇతడు [[అక్షరవర్ధిని]] అనే పత్రికకు, [[సంవీక్షణం]] అనే ద్వైమాసపత్రికకు సంపాదకునిగా పనిచేశాడు.
==సంగీత, నాటక రంగాలు==
ఇతడు ఆకాశవాణిలో ఆడిషన్ పాసై గాయకుడిగా అనేక జానపద గేయాలు పాడాడు. డ్రామా ఆడిషన్ పాసై బి గ్రేడ్ కళాకారుడిగా పాతికకు పైగా రేడియో నాటకాలలో నటించాడు. విజయశంకర్ ప్రభుత్వ సంగీత,నృత్య కళాశాల రాజమండ్రిలో మృదంగం, గాత్రం అభ్యసించాడు. మూషిక మరణం నాటకంతో నాటకరంగ ప్రవేశం చేశాడు. అనేక నాటకాలకు రచయితగా, దర్శకుడిగా పనిచేసి స్వయంగా నటించాడు. పల్లెరథం, సంధ్యారాగం, సువ్వీ సువ్వన్నలాలి, గోదావరి చెప్పిన సుబ్బారావు కథ, అదిగో భద్రాద్రి మొదలైన సంగీత రూపకాలను వ్రాసి ఆకాశవాణిలో ప్రసారం కావించాడు. దూరదర్శన్‌లో ప్రసారమైన గురజాడ దిద్దుబాటు, కథావీధి టెలీ ఫిల్ములలో నటించాడు. 2011 నంది పద్యనాటక పోటీలకు స్కృటినీ జడ్జిగా పనిచేశాడు.
 
==సినిమా రంగం==
ఇతడు [[ఆంధ్రకేసరి (సినిమా)|ఆంధ్రకేసరి]], సుర్ సంగం, [[గాలి శ్రీను]] మొదలైన చిత్రాలలో చిన్న పాత్రలను ధరించాడు. '''మహానంది''' డాక్యుమెంటరీ చిత్రానికి టైటిల్ సాంగ్ వ్రాశాడు. '''దక్షిణ కాశి - ద్రాక్షారామం''' , '''శ్రీకాళహస్తి''', '''కొయ్యబొమ్మలతల్లి కొండపల్లి''' మొదలైన డాక్యుమెంటరీ చిత్రాలకు రచనాసహకారం అందించాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1464803" నుండి వెలికితీశారు