సాదనాల వేంకటస్వామి నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 80:
}}
==జీవిత విశేషాలు==
'''సాదనాల వేంకటస్వామి నాయుడు'''(Sadanala Venkata Swamy Nayudu) [[1961]], [[ఫిబ్రవరి 15]]వ తేదీన [[తూర్పు గోదావరి జిల్లా]], [[ముమ్మడివరం]] మండలం, [[గేదెల్లంక]] గ్రామంలో సత్యవతి, బాలకృష్ణారావు దంపతులకు జన్మించాడు. [[విశాఖపట్నం]] జిల్లా, [[నక్కపల్లి]] గ్రామంలో ఇతని బాల్యం గడిచింది. [[రాజమండ్రి]] వి.టి.జూనియర్, డిగ్రీ కాలేజీలో ఇంటర్‌మీడియెట్, డిగ్రీ ఆర్ట్స్ కాలేజీలో చదివి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ.(తెలుగు) పట్టా పొందాడు. [[రాజమండ్రి]] జి.ఎస్.కె.మెమోరియల్ లా కాలేజీలో లా పూర్తి చేశాడు. [[తెలుగు విశ్వవిద్యాలయం]] లో “కృష్ణాపత్రిక సాహితీసేవ ఒక పరిశీలన” అనే అంశంపై పరిశోధించి ఎం.ఫిల్.పట్టా సాధించాడు<ref>{{cite news|last1=న్యూస్ టుడే|title=కవిత ఏదయినా అది సమాజం కోసమే - సాదనాల మనోదృశ్యం|work=ఈనాడు దినపత్రిక తూర్పుగోదావరి జిల్లా సంచిక|date=1990-01-06}}</ref>.ఆ తర్వాత [[అన్నామలై విశ్వవిద్యాలయం]] నుండి బి.ఇడి.చేసి కందుకూరి వీరేశలింగం ఆస్తిక డిగ్రీ కళాశాల, రాజమండ్రిలో ఆంధ్రోపన్యాసకులుగా కొంతకాలం పనిచేశాడు. తరువాత [[దక్షిణ మధ్య రైల్వే]]లో ప్రథమశ్రేణి తెలుగు పండితుడిగా [[డోర్నకల్]] రైల్వే హైస్కూలులో పనిచేశాడు<ref>{{cite news|last1=ఎన్.తిర్మల్|title=బహుముఖ రసజ్ఞుడు సాదనాల|work=కిన్నెరసాని శీర్షిక ఆంధ్రజ్యోతి దినపత్రిక ఖమ్మం ఎడిషన్|date=2005-11-13}}</ref>. ప్రస్తుతం [[సికిందరాబాదు]] డివిజినల్ కార్యాలయంలో ఛీఫ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్యపేరు మాధురి. కుమార్తె పేరు ఆర్యాణి.
 
==సాహిత్య రంగం==
ఇతడు కథలు, కవితలు, వ్యాసాలు, గేయాలు, నాటికలు అనేకం వ్రాశాడు. ఇతని రచనలు [[సమాచారం (దినపత్రిక)|సమాచారం]], [[కళాప్రభ]], [[నేటి నిజం]], [[అపురూప]], [[అంజలి]], [[రచన (మాస పత్రిక)|రచన]],[[ఎక్స్‌రే]],[[ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక|ఆంధ్రజ్యోతి]] మొదలైన అనేక పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని కథలు, కవితలు పలు సంకలనాలలో చోటు చేసుకున్నాయి. ఇతడు రచించిన గీతాలు కేసెట్లుగా విడుదలయ్యాయి. ఆకాశవాణిలో ఇతడు వ్రాసిన గీతాలు, సంగీతరూపకాలు, నాటికలు ప్రసారమయ్యాయి. ఇతడి రచనలకు ఎన్నో బహుమతులు లభించాయి. పలు సాహిత్య సంస్థలతో ఇతనికి సంబంధాలున్నాయి. అనేక సెమినార్లలో పాల్గొని పత్రసమర్పణ గావించాడు.