సాదనాల వేంకటస్వామి నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 123:
 
==సినిమా రంగం==
ఇతడు [[ఆంధ్రకేసరి (సినిమా)|ఆంధ్రకేసరి]], సుర్ సంగం, [[గాలి శ్రీను]] మొదలైన చిత్రాలలో చిన్న పాత్రలను ధరించాడు<ref>{{cite news|last1=న్యూస్‌లైన్, డోర్నకల్|title=సాహితీమూర్తి సాదనాల|work=సాక్షి దినపత్రిక వరంగల్ జిల్లా 'కాకతీయ కళలు' శీర్షిక}}</ref>. '''మహానంది''' డాక్యుమెంటరీ చిత్రానికి టైటిల్ సాంగ్ వ్రాశాడు. '''దక్షిణ కాశి - ద్రాక్షారామం''' , '''శ్రీకాళహస్తి''', '''కొయ్యబొమ్మలతల్లి కొండపల్లి''' మొదలైన డాక్యుమెంటరీ చిత్రాలకు రచనాసహకారం అందించాడు.
 
==సాంస్కృతిక, సేవా రంగాలు==
ఇతడు జేసీస్ క్లబ్, రోటరీ క్లబ్ మొదలైన సంస్థలలో సభ్యుడిగా ఉన్నాడు. భారతీయ యూత్ హాస్టల్స్ అసోసియేషన్‌ రాజమండ్రి యూనిట్‌కు కన్వీనర్‌గా వ్యవహరించాడు. 1993లో జరిగిన తానామహాసభలకు రాజమండ్రి ప్రాంత కన్వీనర్‌గా, గురజాడ ఆర్ట్స్ థియేటర్‌కు ఉపాధ్యక్షుడిగా, ది ట్రస్ట్ ఆఫ్ సర్వీస్ సంస్థకు కార్యదర్శిగా పనిచేశాడు. అక్షరాస్యత ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఉద్యమగీతాలను రచించాడు. “బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్” పేరుతో ప్రతియేటా 20మంది పేదపిల్లలకు స్కాలర్‌షిప్పులతో పాటు అప్పుడప్పుడు పిల్లలకు పుస్తకాలు, దుస్తులు, చెప్పులు ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు.