మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
 
==ఆలయ ప్రత్యేకతలు==
[[నవనారసింహలునవనారసింహులు]] క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రంగా హేమాచల నృసింహస్వామిని చెపుతారు. స్వామివారి మూర్తి మానవ శరీరంలాగా మెత్తగా ఉంటుంది. స్వామివారి మూర్తిని ఎక్కడ నొక్కి చూసిన మెత్తగా మానవ శరీరం లాగా అనిపిస్తుందట. స్వామివారి ఛాతి మీద రోమాలు దర్శనమిస్తాయి. స్వామివారి బొడ్డు భాగంలోనూ చిన్న రంధ్రం ఉంటుంది. దీనినుంచి ఓ ద్రవం విడుదలవుతూ ఉంటుంది. దీనిని అదుపుచేయడానికి స్వామివారి ఆ రంధ్ర భాగంలో మంచి గంధాన్నుంచుతారు. పూర్వకాలంలో ఈ మూర్తి వెలికితీసే క్రమంలో స్వామివారి మూర్తిమీద రంధ్రం పడిందట. ఆనాటినుంచి ఆ రంధ్రంనుంచి ఓ ద్రవం కారుతుందని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. స్వామి వారి ఆ రంధ్రంలో ఉంచిన మంచి గంధానే్న భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.
 
ఈ మల్లూరులో ఉన్న శ్రీ హేమాచల నృసింహ క్షేత్రంలో ఉన్న ప్రత్యేక ఆకర్షణ ఇక్కడున్న చింతామణి జలపాతం. దట్టమైన అడవిలో కొండలపైనుంచి వస్తున్న ఈ జలధారను చింతామణి జలపాతంగా చెబుతారు. ఈ జలపాతంలో భక్తులు భక్తిస్నానాలు చేస్తారు. ఈ జలధార విశేషమైన ఔషధ గుణాలు కల్గినదని, దీనిని సేవిస్తే సమస్త రోగాలు మటుమాయమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. దీనికి సమీపంలోనే మరో చిన్ని జలపాతం ఉంది.