కొడాలి కమలాంబ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
కమలాంబ గారు నాలుగవ తరగతి వరకు [[నడింపల్లి]] లో చదివారు. పన్నెండు సంవత్సరాల వయస్సులో గ్రంధాలయానికి వెళ్లి [[గాంధీ]]జీ ఆత్మకథ, [[గౌతమ బుద్ధుడు]] జీవిత చరిత్రలు చదివారు. వారిని అమితంగా ప్రభావితం చేసిన గ్రంథాలివే. వారికి చదువుకోవలేనని సంకల్పమున్నా సమీపంలో హై స్కూల్ లేకపోవడం వలన చదువు కొనసాగించలేక పోయారు. బాల్యంలో సంగీతం కూడా నేర్చుకున్నారు.
 
==వివాహం, భర్త, కుటుంబం==
ఈమె [[కొడాలి కుటుంబరావు]] భార్యగా అందరికీ సుపరిచుతురాలు. ఈమె పదహారవ సంవత్సరాన మోపఱ్ఱు కు చెందిన కొడాలి కుటుంబరావు గారి తో వివాహం జరిగింది. వీరికి సమీప బంధువు శ్రీ గుత్తికొండ రామబ్రహ్మం దంపతులు. మోపఱ్ఱు గ్రామంలో కమలాంబ గారు రాట్నాలపై నూలు వడకి తయారు చేసి చీరలు నేయించి వాటిని ధరించేవారు. హరిజనవాడ లో రాట్నాలు ఏర్పాటు చేయించారు. మోపఱ్ఱు గ్రామంలో ఆమె హిందీ చదివి ప్రాధమిక, మాధ్యమిక, రాష్ట్రబాష ల లో ఉత్తీర్ణులైనారు. 1946 లో గాంధీజీ నుండి కమలాంబ గారు రాష్ట్ర విశారద పట్టా ను పొందారు.
 
 
==సంఘసేవ==
 
==స్వతంత్ర సంగ్రామం, జైలు శిక్ష==
సింగంపల్లి సుబ్బారావు గారు ప్రారంభించిన “జాతి భేద నిర్మూలన “ కార్యక్రమాలలో పాల్గొన్నారు. 1940 లో గాంధీ గారికి ఉత్తరం వ్రాసి అనుమతి పొంది మోపఱ్ఱు గ్రామం మధ్యన ఒక నెల రోజుల పాటు హనుమాయమ్మ గారి తో పాటు కాంగ్రెస్ జెండా తో సత్యాగ్రహం చేశారు. గ్రామ హరిజనవాడ లో గ్రంధాలయం ఏర్పాటు చేశారు. గాంధీజీ పిలుపు క్విట్ ఇండియా ఈ క్షణం నుండి ప్రతి భారతీయుడు స్వతంత్రుడు. విజయమో వీర స్వర్గమో తేల్చుకోవాలి, కమలాంబ గారిని పిలుపు కదలించింది.
 
19-09-1942 న తెనాలి లో గల జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్నారు.చిట్టూరి అన్నపూర్ణమ్మ, శాంత ల తో కలసి కోర్ట్ వద్ద పికెటింగ్ చేశారు.పోలీసులు కేసు నమోదు చేయగా మేజిస్ట్రేట్ కమలాంబ గారికి 15 నెలల కఠిన కారాగార శిక్షను విధించారు, ఆమె రాయవెల్లూరు స్త్రీల కారాగారం లో దుర్భరమైన జైలు జీవితాన్ని అనుభవించారు.1943 జనవరి 26 న జైలు లో కాంగ్రెస్ జెండా ను ఎగురవేసి జైలు అధికారుల ఆగ్రహానికి గురయ్యారు. కుమారుని డాక్టర్ చదివించారు.కుమార్తెను యం.యస్సి చదివించారు. గోరా గారి ప్రభావంతో నాస్తిక వాది గా మారారు.మూఢ నమ్మకాలు ,చాందస భావాలు పోవాలని కోరుకునే కమలాంబ గారు ప్రజలు వ్యక్తిగత దృష్టి కాకుండా సంఘ దృష్టి తో జీవించాలని ఆశిస్తున్నారు. 95 సంవత్సరాల వయస్సు లో ప్రకాశం జిల్లా ఇంకొల్లు నందు కుమారుడు అయిన డాక్టర్ కొడాలి ధర్మానందరావు దగ్గర వుంటున్నారు. మరిన్ని వివరాలకు కమలాంబ గారు వ్రాసిన “విరామం ఎరుగని పురోగమనం” చదవండి.
 
==సంఘసేవలో==
[[ఇంకొల్లు]] లో 15.11.1994 న [[గోరా నాస్తిక మిత్రమండలి]] స్థాపించారు. మతపద్ధతిలో పెళ్ళి చేసుకుందని తన సొంత మనుమరాలి పెళ్ళికి వెళ్ళని [[హేతువాది]]. కొడాలి కమలమ్మ మంచంలో లేవలేని స్థితిలో ఉన్నారు. నడుం దగ్గర నుంచి కింది భాగం పనిచేయటం లేదు. కమలమ్మ కొద్ది పాటి చదువులతో ఖద్దరు ధరించి గాంధీజీ స్వాతంత్ర పోరాట ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్ళారు. హిందీలో విశారద చదివారు. విశారద పట్టాను 1940లో మద్రాసులో గాంధి గారి చేతుల మీదుగా తీసుకున్నారు. కుల నిర్మూలన ఉద్యమాల్లో పనిచేశారు. బ్రహ్మ సమాజం ప్రభావం వల్లన అలా చేయగలిగారు. సహపంక్తి భోజనాలు చేసి కుల పట్టింపులు త్రోసి పుచ్చారు. [[క్విట్ ఇండియా]] ఉద్యమంలో పాల్గొన్నారు. చేబ్రోలు గ్రామంలో మహిళా శిక్షణ నిర్వహించిన సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి పాఠశాలలో పాల్గొన్నారు. ఆమె భర్త కుటుంబరావు 1962లో చనిపోగా వాళ్ళ కుమారుడు ధర్మానందరావును డాక్టర్ చదివించింది. అతడు ఇప్పుడు ఇంకొల్లులో ప్రాక్టీసు చేస్తున్నాడు. అతని వద్దే ఆమె ప్రస్తుతం ఉన్నారు. ఆమె కుమార్తె సరళ ఎమ్.ఎస్.సి. చదివి గద్దె రామచంద్రరావును పెళ్ళాడి, అమెరికాలో నయాగర వద్ద స్థిరపడ్డారు. సత్య సాయిబాబా విజయవాడకు రాగా నిరసన తెలిపితే ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నిప్పులు మీద నడచి, అది మహత్తు కాదని ప్రాక్టీసనీ 1980లో ఆమె నిరూపించారు. తన జీవితాన్ని గురించి ప్రచురించిన ''విరామమెరుగని పురోగమనం'' అనే పుస్తకాన్ని జాషువా కుమార్తె, లవణం భార్య హేమలతకు అంకితం ఇచ్చారు..
 
"https://te.wikipedia.org/wiki/కొడాలి_కమలాంబ" నుండి వెలికితీశారు