పత్తిగింజల నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
పత్తి/ప్రత్తి గింజలనుండి నూనెను సాధారణంగా ఎక్సుపెల్లరు <ref>{{citeweb|url=http://www.biodieseltechnologiesindia.com/biodiesel.html|title=Oil Expeller|publisher=biodieseltechnologiesindia.com|date=|accessdate=2015-03-11}}</ref> అను స్క్రూప్రెస్సును ఉపయోగించి తీయుదురు. ఎక్స్పెల్లరుకు విత్తనాన్నిపంపె ముందు స్టీమ్ ద్వారా కెటిల్‌లో కుకింగ్‌ చేసి, పంపెదరు. ఎక్స్‌పెల్లరు నుండి వచ్చు కేకు 2-4 మి.మీ మందంతో, 10-12 సెం.మీ. పరిమాణంలో వుండును. కేకులోమిగిలివున్న నూనెను సాల్వెంట్‌ ప్లాంట్‌ ద్వారా తీయుదురు.విత్తనం పైన్నున పొట్టును తొలగించి.లేదా విత్తానాన్ని నేరుగా ఎక్సుపెల్లరులోక్రషింగ్ చేసి నూనెను తీయుదురు.పత్తివిత్తనాలను ఎక్సుపెల్లరు యంత్రంలోనడిపినప్పుడు,ఇంకను పిండిలో 6-8% వరకు నూనె వుండిపోవును.పిండిలో(Oil cake)వున్ననూనెను పొందుటకై,ఈ పిండిని తిరిగి సాల్వెంట్ ఎక్సుట్రాక్షన్ ప్లాంటు<ref>{{citeweb|url=http://link.springer.com/article/10.1007%2Fs11746-998-0268-4|title=Cottonseed extraction with a new solvent system: Isohexane and alcohol mixtures|publisher=link.springer.com|date=|accessdate=2015-03-11}}</ref> లో నడిపి పిండిలోనిమొత్తం నూనెను తీయుట జరుగును.
 
===నూనె===
 
పత్తిగింజల నుండి తీసిన నూనె నేరుగా వంటనూనెగా పనికిరాదు. రిపైనరిలో రిపైండ్‌ చేసిన తరువాత మాత్రమే ఖాద్యతైలంగా పనిచేయును. ఎక్స్‌పెల్లరుల ద్వారా వచ్చిన నూనె నలుపు, నీలపు ఛాయ వున్న పచ్చరంగులో వుండును. నూనెలో ఫ్రీఫ్యాటి ఆమ్లాల శాతం3-6% వరకు వుండును. మలినాలు, గమ్స్‌, గొసిపొల్ అధిక మొత్తంలో వుండును. వీటన్నింటిని తొలగించాలి. నూనెలోని గమ్స్, ఫ్రీఫ్యాటి ఆసిడులను, గొసిపొల్‌ను కెమికల్‌ రిపైనింగ్‌ పద్ధతిలో కాస్టిక్‌ నుపయోగించి తొలగించెదరు. నూనెలోని ఫ్రీఫ్యాటి ఆసిడులు కాస్టిక్‌తో కలసి సబ్బుగా మారి వేరు పడును. ఇలా ఏర్పడిన సబ్బును తొలగించిన నూనెకు బ్లిచింగ్‌ ఎర్తును (బ్లిచింగ్‌ పౌడరు కాదు) కలిపి, బ్లిచరులో ప్రాసెస్‌ చేసి నూనె రంగును తగ్గించెదరు. తుదిదశలో ఫ్రిఫ్యాటి ఆసిడులు, మలినాలు తొలగింపబడి, రంగు తగ్గింపబడిన నూనెను డి్‌ఒడరైజరుకు పంపి, నూనెను నిర్గంధికరించెదరు. రిపైండు చేసిన నూనె వర్ణరహితంగా లేదా లేతపసుపు వర్ణంలో వుండును. పత్తిగింజల నూనెలోని ఫ్యాటి ఆమ్లాల సమ్మేశనం మరియు శాతం, భౌతిక ధర్మాలు, వేరుశనగ నూనె, పొద్దుతిరుగుడు నూనెల రెండికి మధ్యస్తంగా వుండును. కొన్నిసార్లు పత్తిగింజల నూనెను ఈ రెండు నూనెలలో కల్తి చెయ్యడంకూడా జరుగుతున్నది<ref name="sea"/>.
"https://te.wikipedia.org/wiki/పత్తిగింజల_నూనె" నుండి వెలికితీశారు