వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016: కూర్పుల మధ్య తేడాలు

→‎మేకింగ్ డీఎల్ఐ యాక్సెసిబుల్: ప్రత్యుత్తరం ... మరిన్ని త్వరలో
పంక్తి 15:
 
వనరులు, సామర్ధ్యం గల సిఐఎస్ పై సూచనలను మరియు స్వచ్ఛందంగా సభ్యులు చేసిన గత కృషిని పట్టించుకున్నట్లు లేదు. సమావేశాలలో కలిసిన సభ్యుల వ్యక్తిగత లక్ష్యాలకి తోడ్పాటు అవసరమున్నా లేకపోయినా ప్రధానంగా చేసుకోవడం సరియైన పద్ధతి కాదు. సిఐఎస్ తోడ్పాటు శాశ్వతం కాదు కాబట్టి, తెవికీ బలో పేతానికి ప్రాధాన్యతల వారీగా లక్ష్యం మరియు , దాని ప్రస్తుత స్థాయిని నిర్ణయించడం, వాటిలో వ్యక్తిగతంగా సభ్యులు చేయలేనివాటిని గుర్తించడం , వికీలో చర్చల ద్వారా వాటిగురించి ఉత్ప్రేరకంగా పనిచేయడం మంచిది.దీనికొరకు సిఐఎస్ తనవంతు తోడ్పాటుగా ప్రణాళికని పటిష్టం చేయవలసివుంది. కనుక ప్రణాళికని ఆ దిశగా అలోచించి తగిన మార్పులు చేయవలసినదిగా కోరుచున్నాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:25, 31 మార్చి 2015 (UTC)
: [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు నమస్కారం. మీరు మొదటి నుండీ ప్రణాళికలను పరిశీలించి సూచలు ఇవ్వాడంలో కృషి చేస్తున్నారు. ఇది చాలా అనందించదగిన విషయం. మిగతా సభ్యులు కూడా ఇలాగే చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చిన సూచనలపై మరి కొన్ని వివరణలు త్వరలోనే ఇక్కడ పొందుపరచగలను. ఈ ఆలస్యానికి క్షంతవ్యుడను.--[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 03:30, 5 ఏప్రిల్ 2015 (UTC)
 
== ప్రతిపాదనల స్పష్టత కావాలి. పూర్వానుభవాల పాఠాలు వాడాలి ==
* వికీలో ప్రస్తుతం జరుగుతున్న, జరగబోతున్న(ముందుగా కమ్యూనిటీ చర్చల్లో భాగంగా ప్రణాళిక వేసుకోగా తెలిసినవి) ప్రాజెక్టులను ప్రణాళికలో నేరుగా చేర్చి చివరకు తెవికీలో జరుగుతున్న ప్రతి స్వచ్ఛందమైన అభివృద్ధినీ, కృషినీ సీఐఎస్ చేసిన కృషిగా చూపడం అంత సమర్థనీయంగా తోచట్లేదు. ఇలా చేయకూడదని ఎక్కడా లేకపోయినా ఇది మీ నిజమైన కృషిని అంచనా కట్టేప్పుడు ఇబ్బంది కలుగుతుంది. అంతగా ఉపకరించదు. ఉదాహరణకు అన్నమయ్య గ్రంథాలయం ఇన్స్టిట్యూషనల్ పార్ట్నర్షిప్ లో భాగంగా దాని కాటలాగును అందజేసిందని వ్రాశారు. ఇది సిఐఎస్-ఎ2కె కృషిలో భాగంగా రావడం ఆశ్చర్యకరం. ఎందుకంటే అందుకు వికీమీడియా ఫౌండేషన్ నుంచి నేరుగా తీసుకున్న గ్రాంటు పనుల్లో భాగంగా ట్రావెల్ వంటి ఖర్చులు వినియోగించుకుని [[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్.బి.కె.]] శ్రమించి తీసుకువచ్చారని ఇక్కడ [https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B0%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1#.E0.B0.85.E0.B0.A8.E0.B1.8D.E0.B0.A8.E0.B0.AE.E0.B0.AF.E0.B1.8D.E0.B0.AF_.E0.B0.97.E0.B1.8D.E0.B0.B0.E0.B0.82.E0.B0.A5.E0.B0.BE.E0.B0.B2.E0.B0.AF_.E0.B0.AA.E0.B1.81.E0.B0.B8.E0.B1.8D.E0.B0.A4.E0.B0.95_.E0.B0.9C.E0.B0.BE.E0.B0.AC.E0.B0.BF.E0.B0.A4.E0.B0.BE_.E0.B0.AE.E0.B1.8A.E0.B0.A6.E0.B0.9F.E0.B0.BF.2C_.E0.B0.B0.E0.B1.86.E0.B0.82.E0.B0.A1.E0.B0.B5_.E0.B0.B5.E0.B0.BF.E0.B0.A1.E0.B0.A4.E0.B0.B2.E0.B1.81 చర్చల్లో] తెలుస్తోంది. పైగా విశ్వనాధ్ గారిని ఆ గ్రంథాలయం ఎంచుకోమని చెప్పినదీ, కొన్ని పరిచయాలను ఆయనకి ఇచ్చింది కూడా నేను కావడంతో అది ఇక్కడ నేరుగా చోటుచేసుకోవడం విస్మయాన్నే కలిగించిందని చెప్పాలి.
Return to the project page "వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016".