వెంపటి చినసత్యం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
| caption = వెంపటి చినసత్యం
| birth_name = వెంపటి చినసత్యం
| birth_date = [[25 అక్టోబర్]] [[1929]]
| birth_place = [[కూచిపూడి]], [[కృష్ణా జిల్లా]]
| native_place =
| death_date = [[29 జూలై]] [[2012]]
| death_place = [[చెన్నై]], [[తమిళనాడు]]
| death_cause =
పంక్తి 35:
| weight =
}}
'''వెంపటి చిన సత్యం''' ఆంధ్ర నాట్యాలలో ప్రసిద్ది చెందిన [[కూచిపూడి]] నాట్యాచార్యుడు. ఈయన కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని [[కూచిపూడి]] అగ్రహారంలో [[1929]] [[అక్టోబరు 25న25]]న వరలక్ష్మమ్మ, చలమయ్య దంపతులకు జన్మించారు. కూచిపూడి నాట్యాన్ని దివంగత నాట్యాచార్యులైన వేదాంతం లక్ష్మీనారాయణశాస్త్రి, తాడేపల్లి పేరయ్యశాస్త్రి, [[వెంపటి పెదసత్యం]]ల వద్ద అభ్యసించారు. సినీ నృత్య దర్శకులైన అన్న పెదసత్యం వద్ద 15 ఏళ్లపాటు నాట్యంలో మెలవకులు నేర్చుకున్నారు. చెన్నై లో భరతనాట్యమే విరాజిల్లుతున్న తరుణంలో కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని చెన్నై కళాభిమానులకు పరిచయం చేసి, భరతనాట్యం చెంతన కూచిపూడికి దీటైన స్థానాన్ని సంపాదించి పెట్టారు. తన దగ్గర నృత్యం అభ్యసించే శిష్యుల వద్ద రుసుము సైతం వసూలు చేయకుండా నర్తనశాలను నిర్వహించారు.
కూచిపూడి నాట్యంలో నృత్యనాటికలను ఎన్నిటినో రూపొందించి దేశ విదేశాలలో ప్రదర్శించి వాటికి విశేష పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేసాడు.1963లో చెన్నైలో కూచిపూడి ఆర్ట్ అకాడెమీని స్థాఫించారు. వైజయంతిమాల, హెమమాలిని, మంజుభార్గవి, రాజసులోచన, ప్రభ, చంద్రకళ, రత్నపాప, పద్మామీనన్, వాణిశ్రీ, ఎన్టీఆర్‌ కుమార్తెలు పురంధేశ్వరి, భువనేశ్వరి వారి శిష్యులే.
1947లో మద్రాసుకు చేరుకున్న చినసత్యం తన సోదరుడు వెంపటి పెదసత్యం వద్ద సినిమాలో నృత్య నిర్దేశకత్వంలో సహాయకుడిగా పనిచేశారు. అనంతరం సొంతంగా అనేక తెలుగు చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారు. నర్తనశాల, దానవీరశూర కర్ణ, 'రోజులు మారాయి', 'దేవదాసు', 'అమెరికా అమ్మాయి', 'శ్రీకృష్ణవిజయం', 'సంపూర్ణ రామాయణం', 'లవకుశ' తదితర ఎన్నో చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారు. చినసత్యం వేదాంతం రాఘవయ్య, వెంపటి పెదసత్యంల పర్యవేక్షణలో చలన చిత్రాల్లో కూడా నటించారు.1976లో తితిదే ఆస్థాన నాట్యాచార్యునిగా నియమితులయ్యారు. 1984లో అమెరికా పిట్స్‌బర్గ్‌లోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆస్థాన నాట్యాచార్యునిగా పనిచేశారు. 2011లో హైదరాబాదులో 2,800 మంది కళాకారులతో ఏకకాలంలో నిర్వహించిన అంతర్జాతీయ కూచిపూడి నృత్య కార్యక్రమానికి గిన్నిస్‌ రికార్డు వచ్చింది. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 29.7.2012 న ఆయన చెన్నై లోని నృత్య క్షేత్రం 'కూచిపూడి ఆర్ట్‌ అకాడమీ'లో చనిపోయారు.
"https://te.wikipedia.org/wiki/వెంపటి_చినసత్యం" నుండి వెలికితీశారు