చిత్రలేఖనం: కూర్పుల మధ్య తేడాలు

→‎తీవ్రత: విస్తరణ
పంక్తి 11:
==అంశాలు==
===తీవ్రత===
చిత్రీకరించవలసినదాన్ని అవగతం చేసుకొనటం, దాని తీవ్రతకి ప్రాతినిధ్యం వహించటం చిత్రలేఖనాన్ని సశక్తపరుస్తాయి. విశ్వంలో ప్రతి బిందువుకి ఒక తీవ్రత ఉంటుంది. ఈ తీవ్రతని నలుపుగా గానీ, తెలుపుగా గానీ, ఈ రెంటి మధ్య వివిధ స్థాయిలలో ఉన్నా బూడిద రంగులలో వ్యక్తీకరించవచ్చును. సాధనలో చిత్రకారులు ఆకారాలని వ్యక్తీకరించటానికి వివిధ తీవ్రతలలో గల ఉపరితలాలని ఒకదాని ప్రక్కన మరొకటి చేరుస్తారు. అనగా చిత్రలేఖనం భావజాలం యొక్క మూలాల (జ్యామితీయా ఆకారాల, వివిధ దృక్కోణాల, చిహ్నాల వంటి వాటి) కి అతీతమైనది. ఉధాహరణకి, ఒక తెల్లని గోడ, చుట్టుప్రక్కల ఉన్నటువంటి వస్తువులని బట్టి ఒక్కో బిందువు వద్ద వివిధ తీవ్రతలు ఉన్నట్లుగా ఒక చిత్రకారుడు గమనించగలుగుతాడు, కానీ సైద్ధాంతికంగా తెల్లని గోడ ఎక్కడైనా తెల్లగానే ఉంటుంది. సాంకేతిక పరంగా చూచినట్లయితే గీత యొక్క మందం కూడా గమనార్హం.
 
===రంగు మరియు లక్షణం===
===అసాంప్రదాయిక అంశాలు===
"https://te.wikipedia.org/wiki/చిత్రలేఖనం" నుండి వెలికితీశారు