వెండి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
'''వెండి''' లేదా '''రజతం''' ([[ఆంగ్లం]]: Silver) ఒక తెల్లని [[లోహము]] మరియు రసాయన [[మూలకము]]. దీని సంకేతం '''Ag''' ([[ప్రాచీన గ్రీకు]]: ''ἀργήεντος'' - argēentos - argēeis, "white, shining) మరియు పరమాణు సంఖ్య (Atomic number) 47. ఇది ఒక మెత్తని, తెల్లని మెరిసే [[పరివర్తన మూలకము]] (Transition metal). దీనికి విద్యుత్ మరియు ఉష్ణ ప్రవాహ సామర్ద్యం చాలా ఎక్కువ. ఇది ప్రకృతిలో స్వేచ్ఛగాను మరియు ఇతర మూలకాలతో [[అర్జెంటైట్]] (Argentite) మొదలైన ఖనిజాలుగా లభిస్తుంది.
==స్థూల సమీక్ష==
వెండి ప్రాచీన కాలం నుండి విలువైన లోహంగా ప్రసిద్ధిచెందినది. ఇది [[ఆభరణాలు]], [[నాణేలు]] మరియు [[వంటపాత్రలు]]గావంటపాత్రలుగా ఉపయోగంలో ఉన్నాయి. ఈనాడు వెండిని విద్యుత్ పరికరాలలో, [[అద్దాలు]] మరియు రసాయనిక చర్యలలో ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తున్నారు. వెండి సమ్మేళనాలు ముఖ్యంగా [[సిల్వర్ నైట్రేట్]] (Silver nitrate) ఫోటోగ్రఫీ ఫిల్మ్ తయారీలో విస్తృతంగా ఉపయోగంలో ఉన్నది<ref>{{citeweb|url=http://www.lenntech.com/periodic/elements/ag.htm|title=Chemical properties of silver|publisher=lenntech.com|date=|accessdate=2015-03-13}}</ref> .
 
 
"https://te.wikipedia.org/wiki/వెండి" నుండి వెలికితీశారు