ఎవడే సుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
* రియాగా [[రీతు వర్మ]]
== కథాంశం ==
సుబ్బు అలియాస్ సుబ్రహ్మణ్యం పశుపతి ఇండస్ట్రీస్ అనే కార్పొరేట్ సంస్థలో జనరల్ మేనేజర్ హోదాలో పనిచేస్తూ ఉంటాడు. సుబ్బు జీవితంలో డబ్బే సర్వస్వం అన్నట్టుగా వ్యవహరిస్తూంటాడు. అదే రంగానికి చెందిన వేరే కంపెనీ వ్యాపారాత్మకతతో కాక ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుండడంతో దాన్ని టేకోవర్ చేయాల్సిన స్థితి ఏర్పడుతుంది. ఆ కంపెనీ షేర్లు కొనుగోలు చేస్తూ ఆ సమస్యను పరిష్కరించే పనిలో పడతాడు. ఆ కంపెనీని టేకోవర్ చేయగలిగితే తన కూతురు రియాని ఇచ్చి పెళ్ళిచేసి, కంపెనీకి అధిపతిని చేస్తానని పశుపతి ఇండస్ట్రీస్ ఓనర్ పశుపతి ప్రతిపాదిస్తాడు. ఆ క్రమంలో సుబ్బుతో రియాకి నిశ్చితార్థం కూడా జరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో గోవా నుంచి సుబ్బు ఫ్రెండ్ రిషి వస్తాడు. సుబ్బు డబ్బుకోసం పనిచేసే మనస్తత్వం కలవాడైతే దానికి వ్యతిరేకమైన ఆలోచన విధానం రిషిది.
 
== మూలం ==
"https://te.wikipedia.org/wiki/ఎవడే_సుబ్రహ్మణ్యం" నుండి వెలికితీశారు