ఎవడే సుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
సుబ్బు అలియాస్ సుబ్రహ్మణ్యం పశుపతి ఇండస్ట్రీస్ అనే కార్పొరేట్ సంస్థలో జనరల్ మేనేజర్ హోదాలో పనిచేస్తూ ఉంటాడు. సుబ్బు జీవితంలో డబ్బే సర్వస్వం అన్నట్టుగా వ్యవహరిస్తూంటాడు. అదే రంగానికి చెందిన వేరే కంపెనీ వ్యాపారాత్మకతతో కాక ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుండడంతో దాన్ని టేకోవర్ చేయాల్సిన స్థితి ఏర్పడుతుంది. ఆ కంపెనీ షేర్లు కొనుగోలు చేస్తూ ఆ సమస్యను పరిష్కరించే పనిలో పడతాడు. ఆ కంపెనీని టేకోవర్ చేయగలిగితే తన కూతురు రియాని ఇచ్చి పెళ్ళిచేసి, కంపెనీకి అధిపతిని చేస్తానని పశుపతి ఇండస్ట్రీస్ ఓనర్ పశుపతి ప్రతిపాదిస్తాడు. ఆ క్రమంలో సుబ్బుతో రియాకి నిశ్చితార్థం కూడా జరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో గోవా నుంచి సుబ్బు ఫ్రెండ్ రిషి వస్తాడు. సుబ్బు డబ్బుకోసం పనిచేసే మనస్తత్వం కలవాడైతే దానికి వ్యతిరేకమైన ఆలోచన విధానం రిషిది. ఆ తర్వాత ఆనంది అనే అమ్మాయి కూడా అనుకోకండా సుబ్బు లైఫ్ లోకి వస్తుంది. వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేయడం మొదలు పెట్టిన సుబ్బు తన ప్రొఫెషనల్ వర్క్ ని కాస్త పక్కన పెడతాడు. రిషి రోజూ హిమాలయాల్లోని దూద్ కాశీ వెళ్ళాలని సుబ్బును అడుగుతూంటాడు అప్పుడు హఠాత్తుగా జరిగే సంఘటన తర్వాత సుబ్బు ఆనందిని తీసుకొని హిమాలయాలకు బయలు దేరుతాడు.. సుబ్బు లైఫ్ లో జరిగిన సంఘటన ఏంటి.? అసలు సుబ్బు హిమాలయాలకు ఎందుకు బయల్దేరాడు.? అందులో తనకి తోడుగా ఆనందిని ఎందుకు తీసుకెళ్ళాడు.? అసలు ఈ ప్రయాణంలో ఏం జరిగింది.? అనే విషయాలు కథలో మిగతా భాగం.
== నిర్మాణం ==
=== చిత్ర నేపథ్యం ===
స్వప్నదత్, ప్రియాంక దత్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కోసం షార్ట్ ఫిలిం తీయాలనుకున్నప్పుడు వారికి దర్శకుడు నాగ్ అశ్విన్ పరిచయమయ్యారు. రెండే రోజుల వ్యవధి మిగలడంతో ఆ స్వల్పవ్యవధిలోనే షార్ట్ ఫిలిం కోసం ఓ కథాంశాన్ని అభివృద్ధి చేసి, చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి అందించిన ''యాదోంకీ బారాత్ '' సినిమా ప్రతిష్టాత్మక కేన్స్ చలన చిత్రోత్సవానికి ఎంపికకావడంతో వారికి నాగ్ అశ్విన్ పనితీరు నచ్చింది. పూర్తిస్థాయి సినిమా చేసే అవకాశం ఇచ్చినప్పుడు వేరే కథాంశంపై చర్చలు సాగాయి. 5డి కెమెరా వాడి చిన్న సినిమాగా చేద్దామనుకున్న ఈ కథాంశాన్ని వారికి చెప్పడంతో అది విపరీతంగా నచ్చి ఈ సినిమా ఫీచర్ ఫిల్మ్‌గానే చేద్దామన్న ప్రతిపాదన తీసుకువచ్చారు, కథానాయకుడు నానికి కథను చెప్పి ఒప్పించగలగడంతో చిత్రం ప్రారంభమైంది.
=== కథాంశం అభివృద్ధి ===
స్వప్నదత్, ప్రియాంక దత్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కోసం షార్ట్ ఫిలిం తీయాలనుకున్నప్పుడు వారికి దర్శకుడు నాగ్ అశ్విన్ పరిచయమయ్యారు. రెండే రోజుల వ్యవధి మిగలడంతో ఆ స్వల్పవ్యవధిలోనే షార్ట్ ఫిలిం కోసం ఓ కథాంశాన్ని అభివృద్ధి చేసి, చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి అందించిన ''యాదోంకీ బారాత్ '' సినిమా ప్రతిష్టాత్మక కేన్స్ చలన చిత్రోత్సవానికి ఎంపికకావడంతో వారికి నాగ్ అశ్విన్ పనితీరు నచ్చింది.
 
=== చిత్రీకరణ ===
"https://te.wikipedia.org/wiki/ఎవడే_సుబ్రహ్మణ్యం" నుండి వెలికితీశారు