ఎవడే సుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
 
=== చిత్రీకరణ ===
సినిమా చిత్రీకరణను ఇతర ప్రాంతాలతో పాటుగా ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన శిఖరమైన [[ఎవరెస్ట్ పర్వతం]]పై జరిపారు. ఈ సినిమా భారతీయ చలన చిత్రాల్లో తొలిసారిగా ఎవరెస్ట్ శిఖరంపై చిత్ర నిర్మాణం జరుపుకున్న సినిమాగా చరిత్రకెక్కింది. ఆ క్రమంలో చిత్రబృందం చాలా ఇబ్బందులు, సవాలు విసిరే పరిస్థితులు ఎదుర్కోవాల్సివచ్చింది. మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఈ చిత్రీకరణ సాగింది. నేపాల్ రాజధాని [[ఖాట్మండు]] వరకూ, అక్కడనుంచి లుక్లా నగరం వరకూ విమానయానం ద్వారా వెళ్ళిన బృందం, అక్కడినుంచి సాంకేతిక సామగ్రి, వస్తువులతో సహా కాలినడక, ఎడ్లబళ్ళు వంటి రవాణా సాధనాలపై చిత్రీకరించాల్సిన స్పాట్‌కు చేరుకునేందుకే 10రోజులు పట్టింది. ఎలాంటి ఆధునిక సౌకర్యాలూ లేని ఆ ప్రాంతంలో మార్గమధ్యంలోని ఇళ్ళలో వసతి తీసుకుంటూ దారిలో కొన్ని షాట్స్ చిత్రీకరిస్తూ చిత్రబృందం ముందుకుసాగింది. సినిమాలో కీలకమైన ప్రాంతమైన '''దూద్‌కాశీ''' చేరుకున్నాకా అక్కడ 5రోజుల చిత్రీకరణ జరుపుకున్నారు.<ref name="ఫిల్మ్ బీట్">{{cite web|first1=శ్రీకన్య|title=నాని ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫస్ట్ లుక్!|url=http://telugu.filmibeat.com/news/nani-s-yevade-subramanyam-first-look-motion-poster-043165.html|website=ఫిల్మ్ బీట్ తెలుగు|accessdate=9 April 2015}}</ref> మొత్తంగా ఈ ఎత్తైన శిఖరాలలో దాదాపుగా 40రోజుల షూటింగ్ షెడ్యూల్ జరుపుకున్నారు. ఈ షెడ్యూల్‌కు 36మందితో వెళ్ళగా వారిలో 10మంది అతిశీతల వాతావరణం, అత్యంత ఎత్తైన ప్రదేశాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, తక్కువ ఆహారం అందుబాటులో ఉండడం వంటి కారణాలతో వెనుదిరిగివచ్చారు. చివరివరకూ 26మంది షూటింగ్ చేయగలిగారు.
 
=== నిర్మాణానంతర పనులు ===
"https://te.wikipedia.org/wiki/ఎవడే_సుబ్రహ్మణ్యం" నుండి వెలికితీశారు