ఎవడే సుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 33:
=== చిత్రీకరణ ===
సినిమా చిత్రీకరణను ఇతర ప్రాంతాలతో పాటుగా ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన శిఖరమైన [[ఎవరెస్ట్ పర్వతం]]పై జరిపారు. ఈ సినిమా భారతీయ చలన చిత్రాల్లో తొలిసారిగా ఎవరెస్ట్ శిఖరంపై చిత్ర నిర్మాణం జరుపుకున్న సినిమాగా చరిత్రకెక్కింది. ఆ క్రమంలో చిత్రబృందం చాలా ఇబ్బందులు, సవాలు విసిరే పరిస్థితులు ఎదుర్కోవాల్సివచ్చింది. మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఈ చిత్రీకరణ సాగింది. నేపాల్ రాజధాని [[ఖాట్మండు]] వరకూ, అక్కడనుంచి లుక్లా నగరం వరకూ విమానయానం ద్వారా వెళ్ళిన బృందం, అక్కడినుంచి సాంకేతిక సామగ్రి, వస్తువులతో సహా కాలినడక, ఎడ్లబళ్ళు వంటి రవాణా సాధనాలపై చిత్రీకరించాల్సిన స్పాట్‌కు చేరుకునేందుకే 10రోజులు పట్టింది. ఎలాంటి ఆధునిక సౌకర్యాలూ లేని ఆ ప్రాంతంలో మార్గమధ్యంలోని ఇళ్ళలో వసతి తీసుకుంటూ దారిలో కొన్ని షాట్స్ చిత్రీకరిస్తూ చిత్రబృందం ముందుకుసాగింది. సినిమాలో కీలకమైన ప్రాంతమైన '''దూద్‌కాశీ''' చేరుకున్నాకా అక్కడ 5రోజుల చిత్రీకరణ జరుపుకున్నారు.<ref name="ఫిల్మ్ బీట్">{{cite web|first1=శ్రీకన్య|title=నాని ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫస్ట్ లుక్!|url=http://telugu.filmibeat.com/news/nani-s-yevade-subramanyam-first-look-motion-poster-043165.html|website=ఫిల్మ్ బీట్ తెలుగు|accessdate=9 April 2015}}</ref> మొత్తంగా ఈ ఎత్తైన శిఖరాలలో దాదాపుగా 40రోజుల షూటింగ్ షెడ్యూల్ జరుపుకున్నారు. ఈ షెడ్యూల్‌కు 33మందితో వెళ్ళగా వారిలో ఏడుగురు అతిశీతల వాతావరణం, అత్యంత ఎత్తైన ప్రదేశాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, తక్కువ ఆహారం అందుబాటులో ఉండడం వంటి కారణాలతో వెనుదిరిగివచ్చారు. చివరివరకూ 27మంది షూటింగ్ చేయగలిగారు.<ref>{{cite news|last1=|first1=|title=I showered only 8 times in 40 days: Nani|url=http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/I-showered-only-8-times-in-40-days-Nani/articleshow/45415661.cms|accessdate=9 April 2015|work=టైమ్స్ ఆఫ్ ఇండియా|issue=8 డిసెంబర్ 2014}}</ref> అక్కడి వాతావరణం, జంతువులు వంటివాటితో సిబ్బందికి జరిగిన చిరుచేదు అనుభవాలతో కొన్ని వీడియోలు తీసి యూట్యూబ్‌లో కూడా చేర్చారు. స్విట్జర్లాండ్ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపి, దాన్నే మౌంట్ ఎవరెస్ట్‌గా భ్రమింపజేయవచ్చని, కాకుంటే సినిమాను మరింత సహజంగా తీయాలన్న సంకల్పంతోనే ఇంత శ్రమకోర్చి తీశామని దర్శకుడు పేర్కొన్నారు.<br />
సినిమాలో మిగతా భాగాన్ని హైదరాబాద్‌లో చిత్రీకరించారు.
=== నిర్మాణానంతర పనులు ===
|