వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
:* లక్ష్యాలు: మీరు బహుశా ప్రణాళిక మొత్తం చదివినట్టు లేదు. ప్రణాళిక లక్ష్యం తెవికి ని వాసి పరంగా రాశి పరంగా పెంపొందించడమే. కేవలం వాసే లక్ష్యంగా పెట్టుకొని ఉంటే మనమీపాటికి 10 లక్షల వ్యాసాలు సునాయాసంగా దాటి ఉండేవాళ్ళం. తెవికీలో మొలక వ్యాసాలు ఎంత తగ్గాయో వైజాసత్యగారు విశ్లేషిస్తూ రచ్చబండలో కూడా పెట్టారు. తెవికీని నాణ్యతా పరంగా అభివృధ్ధి ఇంకా చేయాల్సి ఉంది దీనికి ఈ ప్రణాళిక కూడా కట్టుబడి ఉంది అందుకు గాను కొన్ని కార్యక్రమాలను అనుకున్నాం. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో వాటిని ఎలా ఆచరణలో పెట్టాలో మీరు తెలియజేస్తే బాగుంటుంది. కేవలం వ్యాసాల సంఖ్యనే లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటివరకు 10 లక్షలకంటే ఎక్కువ వ్యాసాలు చేసి ఉండవచ్చు.
:* తెవికీ లోటుపాట్లు: కొత్త సభ్యులు రావడం, వారికి తెవికీ పాలసీలు అర్థమవడంలో సమయం పట్టడం కొంత నాణ్యత దెబ్బతినడం, వాటిని మనం సరిచేసుకుంటూ వారికి నియమాలు తెలియజేస్తూ ముందుకుపోవడం ప్రతీ వికీ ప్రాజెక్టు ప్రగతికి సర్వసాధారణం. నాణ్యత దెబ్బతింటుందని కార్యక్రమాలు చేయకుండా, కొత్త సభ్యులు రాకుండా ఏ వికీ కూడా ప్రగతి సాధించలేదు కదా. అలా అని నాణ్యతపై ఈ ప్రణాళిక శ్రధ్ధ తగ్గించలేదు.
:* గతంలోని సభ్యులు సూచించిన లక్ష్యాలు: మీరు ఇచ్చిన లంకెలోని లక్ష్యాలు, ఇతర సభ్యుల సూచనలు చాలా వరకు గత సంవత్సర ప్రణాళికలనే కాకుండా ఈ ప్రస్తుత ప్రణాళికను రూపొందించడంలో ఎంతో దోహదపడ్డాయి. వీలైనంతవరకు ఆచరణ సాధ్యమైన ఆంశాలు ప్రణాళికలో ఉంచడం జరిగింది. ఇంకా ఏవైనా చేర్చాలి అంటే మీరు సూటిగా తెలుపగలరు. మీ, ఇతర సభ్యుల సూచనల ఆధారంగా ప్రణాళికను తప్పకుండా మరింత మెరుగు పరచి తెవికీని ముందుకు తీసుకువెళదాం. --[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 10:18, 10 ఏప్రిల్ 2015 (UTC)
--[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 09:55, 10 ఏప్రిల్ 2015 (UTC)
 
== ప్రతిపాదనల స్పష్టత కావాలి. పూర్వానుభవాల పాఠాలు వాడాలి ==
Return to the project page "వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016".