ఎస్.కె.పొట్టెక్కాట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
==జీవిత విశేషాలు==
 
ఎస్.కె.పొట్టెక్కాట్ [[కొళికోడ్]] లో జన్మించాడు. ఈయన తండ్రి కున్నిరామన్ పొట్టెక్కాట్ ఇంగ్లీషు బోధించే పాఠశాల ఉపాధ్యాయుడు. ఎస్.కె ప్రాథమిక విద్య కొళికోడులోని హిందూ పాఠశాల మరియు జామోరిన్ ఉన్నత పాఠశాలల్లో కొనసాగింది. 1934లో కొళికోడులోని [[జామోరిన్ కళాశాలనుండికళాశాల]]నుండి పట్టభద్రుడయ్యాడు. చదువైన మూడు సంవత్సరాలపాటు ఉద్యోగం దొరకలేదు. నిరుద్యోగిగా గడుపుతున్న ఆ సమయాన్ని భారతీయ మరియు పాశ్చాత్య సాహిత్వంలోని ఉత్కృష్ట రచనలను అధ్యయనం చేయటానికి ఉపయోగించుకున్నాడు. 1937 నుండి 1939 వరకు కాలికట్ గుజరాతీ పాఠశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. 1939లో త్రిపురలో జరిగిన [[భారత జాతీయ కాంగ్రేసు]] సమావేశానికి హాజరు కావటానికి ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆ తరువాత [[బొంబాయి]] వెళ్ళి అనేక చిన్నాచితకా ఉద్యోగాలు చేసి, కుర్చీలో కూర్చొని చేసే ఉద్యోగాలంటేనే ఏవగింపు ఏర్పరచుకొన్నాడు. 1945లో కేరళ తిరిగివచ్చాడు. 1952లో జయవల్లిని వివాహమాడి, కాలికట్లోనికొళికోడ్లోని పుతియరలో స్థిరపడ్డాడు. పొట్టెక్కాట్కు నలుగురు సంతానం; ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. 1980లో శ్రీమతి మరణించిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించింది. 1982 జూలైలో పక్షవాతంతో ఆసుపత్రిలో చేరాడు. ఈయన 1982, ఆగష్టు 6న మరణించాడు. మరణించే సమయానికి పొట్టెక్కాట్ 1962 మరియు 1967ల మధ్య పార్లమెంటు సభ్యునిగా ఢిల్లీలో తన అనుభవాలను గ్రంథస్తం చేస్తూ నార్త్ ఎవెన్యూ అనే రచన చేస్తున్నాడు. అది సశేషంగానే మిగిలిపోయింది.
 
==సాహిత్య సేవ==